Rs. 54 Lakhs Bill For 10 Days: 10 రోజుల చికిత్సకు 54 లక్షల బిల్లు.. పేషెంట్‌ని విడిచేది లేదంటున్న హాస్పిటల్

Rs. 54 Lakhs Bill For 10 Days Treatment: ఎంబిటి నేత అంజద్ ఉల్లా ఖాన్ ట్విటర్ ద్వారా పేర్కొన్న వివరాల ప్రకారం.. సయ్యద్ రహ్మత్ ఉద్దిన్ అనే పేషెంట్ శేరిలింగంపల్లి సమీపంలోని నల్లగండ్లలో ఉన్న సిటిజెన్స్ హాస్పిటల్‌లో అనారోగ్యంతో చేరాడని.. అతడికి 10 రోజుల పాటు చికిత్స చేసిన హాస్పిటల్.. మొత్తం రూ. 54 లక్షల బిల్లు చెల్లించాల్సిందిగా బిల్లు చేతిలో పెట్టిందని తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2023, 08:51 PM IST
Rs. 54 Lakhs Bill For 10 Days: 10 రోజుల చికిత్సకు 54 లక్షల బిల్లు.. పేషెంట్‌ని విడిచేది లేదంటున్న హాస్పిటల్

Rs. 54 Lakhs Bill For 10 Days Treatment: హైదరాబాద్‌లో కార్పొరేట్ హాస్పిటల్స్ పేరెత్తితేనే హార్ట్ ఎటాక్ వచ్చే పరిస్థితి తలెత్తింది. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పేరెత్తితే.. అనారోగ్యం సంగతి అటుంచి ఆ రోగానికి అయ్యే చికిత్స కంట్లే క్లిష్టమైన స్టేజ్ ఆస్పత్రిలో బిల్లు చెల్లించడం అనేలా తయారైంది. ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రుల్లో నిలువు దోపిడీ అంటూ హాస్పిటల్ బిల్స్ సహా ఎన్నో ఆస్పత్రుల పేర్లు గతంలో వైరల్ అయ్యాయి. అయినప్పటికీ కార్పొరేట్ హాస్పిటల్స్ తీరు మాత్రం మారడం లేదు. తాజాగా మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ నేత అంజద్ ఉల్లా ఖాన్ ట్విటర్ ద్వారా షేర్ చేసిన ఓ ఉదంతం మరో హాస్పిటల్‌కి సంబంధించిన ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.   

ఎంబిటి నేత అంజద్ ఉల్లా ఖాన్ ట్విటర్ ద్వారా పేర్కొన్న వివరాల ప్రకారం.. సయ్యద్ రహ్మత్ ఉద్దిన్ అనే పేషెంట్ శేరిలింగంపల్లి సమీపంలోని నల్లగండ్లలో ఉన్న సిటిజెన్స్ హాస్పిటల్‌లో అనారోగ్యంతో చేరాడని.. అతడికి 10 రోజుల పాటు చికిత్స చేసిన హాస్పిటల్.. మొత్తం రూ. 54 లక్షల బిల్లు చెల్లించాల్సిందిగా బిల్లు చేతిలో పెట్టిందని తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రికి రూ. 20 లక్షల వరకు చెల్లించిన పేషెంట్ కుటుంబసభ్యులు ఇక చెల్లించే పరిస్థితుల్లో లేరని.. కానీ కనీసం మరో రూ. 29 లక్షల బిల్లు చెల్లించనిదే పేషెంట్ ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి వీల్లేదని హాస్పిటల్ వర్గాలు స్పష్టంచేశాయని అంజద్ ఉల్లా ఖాన్ ట్విటర్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సైబరాబాద్ పోలీసులు, చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడికి చెక్ పెట్టే వ్యవస్థ ఏదైనా ఉంటే.. ఈ ఉదంతాన్ని పరిశీలించి ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంబీటీ నేత అంజద్ ఉల్లా ఖాన్ డిమాండ్ చేశారు. మొత్తం బిల్లు చెల్లించనిదే పేషెంట్ ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి వీల్లేదని అడ్డుకుంటున్న ఆస్పత్రిపై చర్యలు తీసుకుని బాధితుడిని అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రి లేదా నిమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అంజాద్ విజ్ఞప్తి చేశారు. 

 

కరోనావైరస్ వ్యాప్తి సమయం నుంచి కార్పొరేట్ ఆస్పత్రులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయని జనం ఆగ్రహంతో ఉన్న ప్రస్తుత తరుణంలోనే వెలుగుచూసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్పిటల్ వ్యవహారంపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. ట్విటర్ ద్వారా నేరుగా తెలంగాణ ప్రభుత్వ అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడం, ఈ ట్వీట్ వైరల్ అవుతుండటంతో ప్రభుత్వం ఈ ఘటనపైనే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రుల వైఖరిపై ఎలా స్పందిస్తుందా అనే ఆసక్తి జనంలో నెలకొని ఉంది.

ఇది కూడా చదవండి : Homeless Old Man: బతికున్న వృద్ధుడిని చెత్త ట్రాక్టర్ ఎక్కించిన శానిటరి సిబ్బంది

ఇది కూడా చదవండి : Shocking Viral Video: గాల్లో కొట్టుకొచ్చిన వస్తువు తగిలి బైక్‌పై ఉన్న మనిషి అదృశ్యం

ఇది కూడా చదవండి : Attack On Fruit Vendor: రూ. 5 కోసం పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారిపై పైశాక దాడి.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News