Shilpa Shetty: చిక్కుల్లో శిల్పా శెట్టి.. సాగర కన్యపై చీటింగ్ కేసు కేసు నమోదు..

Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై ఛీటింగ్ కేసు నమోదు అయింది. బోగస్  బంగారం కేసులో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో వీరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసారు.

 

1 /6

శిల్పా శెట్టి ఈ పేరు గురించి తెలుగు ఆడియన్స్  కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పేరుకు తగ్గట్టు శిల్పి ఉలిని పట్టుకొని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది శిల్పా శెట్టి శరీర సౌష్ఠవం.

2 /6

మధ్యలో సినిమాలకు దూరమైనా.. తన యోగాసనాలతో అభిమానులకు ఎపుడు దగ్గరగానే ఉంది. ఏజ్ 50 యేళ్లకు దగ్గర పడ్డ ఇప్పటికీ అదే శరీరాకృతితో అలరిస్తూనే మెస్మరైజ్ చేస్తోంది ఈ మంగళూరు భామ.

3 /6

ఆ సంగతి పక్కన పెడితే.. శిల్పాశెట్టితో పాటు ఆమె భర్త పై ఛీటింగ్ కేసు నమోదు అయింది.  ఆమె భర్త రాజ్ కుంద్రాపై బోగస్ గోల్డ్ స్కీమ్ పథకంతో తమను మోసం చేసినట్టు ఓ బిజినెస్ మ్యాన్ చేసిన కంప్లైంట్ ఆధారంగా ముంబై స్పెషల్ సెషన్స్ జడ్జ్ ఎన్.పి.మెహతా ఆదేశాల మేరకు  ముంబై పోలీసులు శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు చేసారు. 

4 /6

శిల్పా శెట్టి దంపతులు కొత్తగా స్థాపించిన సత్ యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, దాని టూ బోర్డ్ మెంబర్స్.. ఒక ఎంప్లాయి కలిసి బంగారం మోసానికి పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండటంతో కోర్టు వారిపై కేసు నమోదుకు ఆదేశించారు

5 /6

శిల్పాశెట్టి విషయానికొస్తే.. రీసెంట్ గా  ఈ భామ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో తార శెట్టి అనే పోలీస్ ఆఫీసర్‌లో పాత్రలో  మెప్పించింది.

6 /6

పేరుకు హిందీ భామ అయినా.. తెలుగు సినిమాలతో శిల్పాకు మంచి అనుబంధమే ఉంది. శిల్పాశెట్టి.. టాలీవుడ్‌లో వెంకటేష్ హీరోగా దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'సాహసవీరుడు సాగరకన్య' మూవీతో పరిచయమైంది.