Hair Care Tips: అందమైన జుట్టు, నిగనిగలాడేందుకు పాటించాల్సిన చిట్కాలు

కేశ సంరక్షణ చాలా ముఖ్యమైంది . ముఖ్యంగా చలికాలంలో జుట్టును కాపాడుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చలికాలంలో కేశ సంబంధిత సమస్యలు చాలా ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ లేదా రెమిడీస్ పాటిస్తే చలికాలంలోనే కాదు ఎప్పుడైనా సరే కేశాలు నిగనిగలాడుతుంటాయి.

Hair Care Tips: కేశ సంరక్షణ చాలా ముఖ్యమైంది . ముఖ్యంగా చలికాలంలో జుట్టును కాపాడుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చలికాలంలో కేశ సంబంధిత సమస్యలు చాలా ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ లేదా రెమిడీస్ పాటిస్తే చలికాలంలోనే కాదు ఎప్పుడైనా సరే కేశాలు నిగనిగలాడుతుంటాయి.

1 /8

నో డ్రైయర్ చలికాలంలో జుట్టు ఆరబెట్టేందుకు డ్రైయర్ వాడకూడదు. వేడి గాలితో జుట్టు డ్రైగా మారుతుంది

2 /8

మాయిశ్చరైజింగ్ షాంపూ,  కండీషనర్  చలికాలంలో మాయిశ్చరైజింగ్ షాంపూ, కండీషనర్ వినియోగించాలి. దీనివల్ల జుట్టులో తేమ అలానే ఉంటుంది. తేనె, అల్లోవెరా, గ్లిసరిన్ వంటివి వినియోగించాలి. 

3 /8

హ్యాట్ లేదా స్కార్ప్ ధరించడం చలికాలంలో జుట్టును కాపాడుకునేందుకు హ్యాట్ లేదా స్కార్ప్ ధరించాలి. దీనివల్ల కేశాల్లో తేమ కొనసాగుతుంది. డ్రైనెస్ నుంచి కాపాడుకోవచ్చు

4 /8

తడి జుట్టు చలికాలంలో జుట్టులో తేమ తగ్గిపోతుంది. అందుకే స్నానం చేసినప్పుడు జుట్టు టవల్‌తో తుడవకూడదు. అంటే రబ్ చేయకూడదు. టవల్‌తో తడి పీల్చుకునేలా చేయాలి

5 /8

ఆయిలింగ్ చలికాలంలో జుట్టు చాలావరకు డ్రై అవుతుంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే సాధ్యమైనంతవరకూ ఆయిల్ రాస్తుండాలి. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆర్గాన్ నూనె వాడవచ్చు. వారంలో కనీసం 2-3 సార్లు ఇలా చేయాలి

6 /8

వైట్ హెయిర్ కేర్ చలికాలంలో కేశాల సంరక్షణ చాలా అవసరం. జుట్టు నిర్జీవంగా, డ్రైగా మారిపోతుంటుంది. దాంతో డేండ్రఫ్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు రావచ్చు. చలికాలంలో కొన్ని ప్రత్యేక చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

7 /8

నో హాట్ వాటర్ చలికాలంలో సాధారణంగా వేడి నీళ్లతో స్నానం చేస్తుంటాం. కానీ వేడి నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టు త్వరగా పాడవుతుంది. అందుకే గోరు వెచ్చని నీటినే వాడాలి.

8 /8

హెల్తీ డైట్ హెల్తీ హెయిర్ కోసం డైట్ కూడా బాగుండాలి. అందుకే చలికాలంలో ఎక్కువగా ప్రోటీన్లు, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. చేపలు, నట్స్, పండ్లు, ఆకు కూరలు మంచివి