Kovai Sarala: కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేమిటంటే..!

Tollywood lady comedian: సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న కోవై సరళ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బ్రహ్మానందంతో ఈమె చేసే కామెడీతో కడుపుబ్బా నవ్వించేది. అలాంటిది ఈమె ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

1 /5

కోవై సరళ.. ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా మంచి పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా బ్రహ్మానందం,  కోవై సరళ కాంబోలో కామెడీ సన్నివేశాలు అంటే ఒక బ్రాండ్ ముద్ర పడిపోయింది.  సినీ రంగంలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. నిజ జీవితంలో మాత్రం ఊహించని ఇబ్బందులను,  అవాంతరాలను ఎదుర్కొంది. దీనికి తోడు ఈమె వయసు వారంతా పెళ్లిళ్లు చేసుకొని, వారి పిల్లలకు కూడా పెళ్లిళ్లు చేస్తుంటే .. కోవై సరళ మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తోంది.   

2 /5

మరి ఇన్నేళ్లయినా.. కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1979లో ఆర్.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన వెళ్లి రత్నం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. అందులో చాలా చిన్న పాత్ర చేసిన ఈమె మంచి గుర్తింపు లభించింది.  దాంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత 1987లో మోహన్ బాబు నటించిన వీర ప్రతాపం అనే సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది. 

3 /5

ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈమె మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. అయితే ఈమధ్య సినిమాలకు దూరమైంది. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎక్కువైపోయారు. అందుకే మాలాంటి వాళ్లకు ఆఫర్లు తగ్గిపోయాయి అని తెలిపింది. 

4 /5

ఇక ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నించగా.. తన అక్క చెల్లెళ్ల కోసం పెళ్లి చేసుకోలేదని, వాళ్ళందర్నీ విదేశాల్లో సెటిల్ చేశానని తెలిపింది. తాను సంపాదించిన డబ్బు మొత్తం కుటుంబానికే ఖర్చు చేశానని,  ముఖ్యంగా తమ సోదరీమణుల పిల్లల కోసమే డబ్బు అంతా ఖర్చయిపోయిందని,  ప్రస్తుతం తన దగ్గర ఏమీ లేదు అని, ఉన్న కొంత ఆస్తి కోసం కూడా కుటుంబ సభ్యులు తనపై కోర్టులో కేసు వేశారని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యింది. 

5 /5

ఇకపోతే ఈ విషయం తెలిసి అభిమానులు, నెటిజన్లు కంటతడి పెట్టుకుంటున్నారు.  కుటుంబానికి జీవతాన్నే త్యాగం చేసినా.. ఆ కుటుంబీకులకు ఇసుమంతైన విశ్వాసం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.