Barack Obama: ఒబామా విడాకుల అంశంలో బిగ్ ట్విస్ట్.. అసలు నిజం బైటపెట్టిన మిషెల్ ఒబామా టీమ్.. ఏమన్నారంటే..?

Michelle Obama on divorce rumours: మిషెల్ ఒబామా టీమ్ కొన్ని రోజులుగా వస్తున్న విడాకుల  రూమర్స్ పై స్పందించారు. ఈ క్రమంలో దీనిపై బిగ్ ట్విస్ట్ ఎదురైందని చెప్పుకొవచ్చు.

1 /6

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాజ్ ఒబామా, తన భార్య మిషెల్ ఒబామాతో విడిపొతున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరు కొన్నిరోజులుగా ఎడముఖం, పెడముఖంగా ఉంటున్నారని కూడా వార్తలు వచ్చాయి.  

2 /6

అంతే కాకుండా.. గతంలో కూడా ఈ జంట విడిపోదామని ప్రయత్నించారని.. కానీ చివరకు కౌన్సిలింగ్ వల్ల తిరిగి తమ మనస్సులు మార్చుకున్నారు. అయితే.. ఈ క్రమంలో తాజాగా.. మిషెల్ టీమ్ దీనిపై స్పందించింది.

3 /6

బరాక్ ఒబామా, మిషెల్ ఒబామాల మధ్య మనస్పర్థలు ఉన్నాయని దానిలో వాస్తవంలేదన్నారు. ఇవన్ని రూమర్స్అంటూ కొట్టిపారేశారు. ఇలాంటి నిరాధార రూమర్స్ వ్యాప్తి చేయడం మానుకొవాలన్నారు. 

4 /6

ఇటీవల యూఎస్ మాజీ అధ్యక్షుడు  జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమం సమయంలో మిషెల్ ఒబామా .. వ్యక్తిగత పనులు మీద వేరే దేశంలో ఉన్నారని..అందుకే హజరుకాలేదన్నారు.  

5 /6

అంతేకాకుండా.. ట్రంప్ గతంలో బరాక్ ఒబామా కుటుంబం, నల్ల జాతీయులపై ఇష్టమున్నట్లు వ్యాఖ్యలు చేయడం వల్ల.. ఆయన ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉంటున్నట్లు  వెల్లడించారు.  ఈ విషయంలో మిషెల్ చాలా నొచ్చుకున్నట్లు టీమ్ వెల్లడిచింది.

6 /6

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మిషెల్ ఒబామాతో పాటు.. నాన్సీ పెలోసీ, కాంగ్రెస్ నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్ లు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి డైవర్స్ విషయంలో వస్తున్న వార్తలకు మాత్రం చెక్ పెట్టినట్లైంది.