Tirumala Tragedy 3 Years Old Dead: తిరుమలలో ఘోర విషాదం చోటు చేసుకుంది. దర్శనానికి వచ్చిన మూడేళ్ల బాలుడు మృతి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనం రెండో అంతస్తు పైనుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. దీంతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి పూర్తి వివరాలు ఇవే..
తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. అలాగే కడపకు చెందిన ఓ కుటుంబం కూడా వచ్చింది కానీ, అనుకోని ఘటనతో ఘోర విషాదం చోటు చేసుకుంది. దర్శనానికి వచ్చిన కుటుంబానికి తీరని లోటు మిగిల్చింది. మూడేళ్ల బాలుడు పద్మనాభ నిలయ భవనం రెండో అంతస్తు గ్రిల్స్ నుంచి కింద పడి మరణించాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది
శ్రీవారి దర్శనానికి వచ్చిన శ్రీనివాసులు కడపకు చెందినవారు. వారి కుటుంబానికి 16వ తేదీ దర్శనం టోకెన్లు జారీ చేశారు. దీంతో బుధవారం తిరుమల పైకి చేరుకుని అక్కడ లాకర్ తీసుకున్నారు. అక్కడ సముదాయం వద్ద తన అన్నతో పాటు ఈ మూడేళ్ల బాలుడు సాత్విక్ ఆడుకుంటున్నాడు. ప్రమాదవ శాత్తు గ్రిల్స్ మధ్యలో నుంచి ఈ బాలుడు కింద పడిపోయాడు.
సాత్విక్ కింద పడటంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సాత్విక్ను ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి ఉత్తర ద్వారం దర్శనాలు జనవరి 10 నుంచి 19 తేదీ వరకు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనానికి అనుమతించడం లేదు.. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో జారీ చేస్తున్నారు. అక్కడికి వెళ్లి తీసుకున్న వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు.
ఇక తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈనెల 8వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన మరువక ముందే మరో బాలుడి మృతి విషాదాన్ని మిగిల్చింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.