Samantha: నిన్ను అలా పిల్వడం ఇష్టం లేదు.. సమంతకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కీర్తి సురేష్.. మ్యాటర్ ఏంటంటే..?

Keerthy Suresh on Samantha: కీర్తిసురేష్ ఇటీవల సమంతకు ఒక వాయిస్ మెస్సెజ్ చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలో సామ్ చాలా సేపు కూడా మహానటి మాటలు వింటు ఎమోషనల్ కు గురయ్యారు.
 

1 /6

సమంత, కీర్తిసురేష్ లు ఇద్దరు మంచి ఫ్రెండ్స్.  ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు.తమ మూవీస్, పర్సనల్ ట్రిప్స్ మొదలైనవి ఇన్ స్టాలో తరచుగా అభిమానులతో షేర్ చేసుకుంటు ఉంటారు. 

2 /6

సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలో కీర్తి సురేష్ ఒక వాయిస్ మెస్సెజ్ ను సమంతకు పంపి.. ఆమెను సర్ ప్రైజ్ చేశారు. దీనిలో కీర్తిసురేష్ చాలా ఎమోషనల్గా  మాట్లాడారు.

3 /6

కీర్తిసురేష్..తనకు , సామ్ కు ఫ్రెండ్ షిప్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో కూడా గుర్తు లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇద్దరం కలిసే ఉంటున్న ఫీలింగ్ ఉందన్నారు. తను నాకు ఫ్రెండ్ అని పిల్వడం కన్న.. ఒక సోదరి అని పిలవడం ఎంతో ఇష్టమని అన్నారు. అంతే కాకుండా.. జీవితం విసిరిన అనేక సవాళ్లను సామ్ ధైర్యంగా ఎదుర్కొంటుదన్నారు.

4 /6

లైఫ్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొవడంలో సామ్ ను ఎన్నో విషయాలు చూసి నేర్చుకున్నట్లు కీర్తి సురేష్ చెప్పారు. ఈ విధంగా వెన్ను చూపకుండా పొరాటడం నీకు మాత్రమే సాధ్యమంటూ సమంతను.. మహనటి ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ ప్రశంసలకు సామ్ నవ్వుతూ.. థైంక్స్ చెప్పారు.  

5 /6

ఇదిలా ఉండగా.. కీర్తిసురేష్ ను బేబీ జాన్ మూవీకి సామ్.. సజ్జస్ట్ చేశారు. ఆమె తమిళంలో చేసిన తెరీ మూవీకి రిమేక్ ఈ బేబీ జాన్ సినిమా. ఈసినిమాతో మహానటి బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఇక కీర్తి సురేష్ తాజాగా.. పెళ్లి తర్వాత తొలి పొంగల్ వేడుకల్ని ఆంటోనీ తట్టిల్, ఫ్రెండ్స్ తో కలిసి గ్రాండ్ గా జరుపుకున్నారు.

6 /6

సమంతను గతంలో ఆలియా భట్ కూడా.. ఇదే విధంగా ప్రశంసలు కురిపించారు. అయితే.. సామ్ కొత్త ఏడాదిలో తన పెళ్లి, పిల్లల విషయంలో అంతా పాజిటివ్ గా జరుగుతుందని గతంలో పోస్ట్ పెట్టారు. ఇటీవల సామ్ చికున్ గున్యాకు గురయ్యారు. ఈ నొప్పులు కాస్తంత ఇబ్బంది కల్గించిన ఫన్నీగా అన్పించిందని సామ్ ఇన్ స్టాలో పొస్ట్ లు పెట్టారు. ప్రస్తుతం మహనటి సమంతపై ప్రశంసలు కురిపించడం మాత్రం వార్తలలో నిలిచింది.