Uric Acid Remdy: యూరిక్ యాసిడ్ ప్రధాన లక్షణం తరచూ కండరాలు, కీళ్లనొప్పులు. మీరు కూడా యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా?
Uric Acid Remdy: యూరిక్ యాసిడ్ ప్రధాన లక్షణం తరచూ కండరాలు, కీళ్లనొప్పులు. మీరు కూడా యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే, ఓ ఎరుపు రంగు కూరగాయతో యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు.
సాధారణంగా యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కాలేయ సంబంధిత సమస్యలు, కీళ్లనొప్పులతో బాధపడుతుంటారు. రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే హైపర్‌యూరిసిమియా అనే వ్యాధి వస్తుంది. దీంతో మూత్ర పిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. దీన్ని అధిగమించడానికి కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. అందులో క్యారట్ ఒకటి.
క్యారట్‌లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రక్తంలో యూరిక్ యాసిడ్ సమస్యను పెరగకుండా సహాయపడుతుంది. అంతేకాదు క్యారట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగదు.
క్యారట్‌ను నేరుగా తినవచ్చు. దీన్ని సలాడ్ గా చాలా ఆహార పదార్థాల్లో వాడుతారు. ముఖ్యంగా క్యారట్ ను జ్యూస్ రూపంలో తాగొచ్చు. లేదా చిన్నగా కట్ చేసి క్యారట్ ముక్కలను తినవచ్చు. రక్తంలో యూరిర్ యాసిడ్ సమస్య పెరగదు.
ముఖ్యంగా క్యారట్, నిమ్మకాయను కలిపి జ్యూస్ చేసుకుని తాగాలి. ఇలా తాగితే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది. కీళ్లనొప్పులు, కండరాల నొప్పితో బాధపడేవారు క్యారట్ జ్యూస్ తాగాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )