Bad Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతే గుండెజబ్బులు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి కొన్ని మూలికలు ఉన్నాయి. వీటితో మనం ఏ సైడ్‌ఎఫెక్ట్స్ లేకుండా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం
తులసి అందరి ఇళ్లలో ఉండే మొక్క దీన్ని డైట్లో చేర్చుకుంటే ఎల్‌డీఎల్ స్థాయిలు తగ్గి, హెచ్‌డీఎల్ స్థాయిలు పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కొలెస్ట్రాల్ నిర్వహణలో తులసి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ మూలికను మీ డైట్లో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ తక్షణమే చెక్ పెట్టేయొచ్చు. తులసి టీ ని సులభంగా తయారు చేసుకోవచ్చు. రోజువారీ ఆహారంలో ఉదయం పరగడుపున తీసుకుంటే మేలు జరుగుతుంది.
జీర్ణ సమస్యలు.. తులసి టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు రావు. తులసి టీ తాగితే పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మలబద్ధకం సమస్యలు రాకుండా ఉంటాయి. పేగు ఆరోగ్యానికి తులసి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదనపు చక్కెర , ఉప్పు తినడం మానుకోండి.
తులసి టీ తాగడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ ని సులభంగా తగ్గించేస్తాయి. గుండె నాళల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా బయటకు పంపించే శక్తి వీటికి ఉంటుంది.రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటును మార్చుకుని రాత్రి భోజనం తేలికగా చేయండి.
తులసి టీ డైట్లో చేర్చుకుంటే కాలేయాన్ని కాపాడుతుంది. తులసి ఆకులు మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇవి మనం క్రమం తప్పకుండా చేర్చుకోవాలి..(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )