Relationship: మీ భర్తతో పొరపాటున అనకూడని 5 మాటలు.. బంధం బీటలు వారుతుంది సుమీ..!

Relationship Tips:బంధం 10 కాలాలపాటు బీటలు వాడకుండా ఉండాలంటే కొన్ని రూల్స్ పాటించాల్సిందే. అయితే మీ భాగస్వామితో ఎలా ఉండాలి? అనేది మీ నిర్ణయం. కానీ అది ఇద్దరి మధ్య చీలికలు తెచ్చే విధంగా ఉండకూడదు.
 

1 /5

రిలేషన్ షిప్ లో మీ భాగస్వామితో అనకూడని కొన్ని మాటలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల వారి మనసు విరిగిపోతుంది. రిలేషన్ షిప్ లో మీ భర్తతో అనకూడని ఐదు మాటలు ఉన్నాయి. అవి పొరపాటున కూడా నోరు జారకూడదు.  

2 /5

ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను ముందుగానే చెప్పాను కదా అని పదేపదే అనుకోకుండా నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకుందాం, ఇద్దరం కలిసి పరిష్కారం చేసుకుందాం. ఆ మాటలు చెబితే రిలేషన్షిప్ పదికాలాలపాటు చల్లగా కొనసాగుతుంది.  

3 /5

మీ భర్త వల్ల ఏదైనా తప్పిదం జరిగితే నువ్వు ఒక ఇడియట్, నీతో ఏ పని కాదు అని ఇష్టానుసారంగా మాట్లాడకుండా పరిస్థితిని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అప్పుడే మీ బంధం 10 కాలాలపాటు హాయిగా కొనసాగుతుంది ముఖ్యంగా పదే పదే మీ భర్తతో 'డి' వర్డ్స్ మాట్లాడకూడదు. అంటే డైవర్స్ తీసుకుందాం, డైవర్స్ ఇస్తాను అని పదే పదే అనడం వల్ల బంధంలో చీలికలు ఏర్పడతాయి.

4 /5

కుటుంబంలో ఏ క్లిష్ట పరిస్థితులు వచ్చిన ఇద్దరు కలిసి సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి. ఒకరిపై ఒకరు పోట్లాట మొదలు పెడితే అది తీవ్ర పరిస్థితులకు దారితీస్తుంది. కలిసి సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి. దీన్ని పెంచే విధంగా ఉండకూడదు.  

5 /5

అంతే కాదు రిలేషన్ షిప్ లో ఏ బ్రేక్ రాకుండా ఉండాలంటే నీకంటే నా ఎక్స్‌ లవర్‌ బెట్టర్ అని పొరపాటున కూడా అనకూడదు. ఏ సమస్య వచ్చిన శాంతియుతంగా పరిష్కరించే విధంగా ఉండాలి. అంతేగాని నేను నిన్ను ప్రేమించలేదు అని మాత్రం పొరపాటున అనకూడదు