Things To Do And Avoid After Intercourse: శృంగారంలో పాల్గొన్న తరువాత ఏం చేయాలి, ఏం చేయొద్దు..

Things To Do And Avoid After Intercourse: కొన్నిసందర్భాల్లో సెక్స్‌లో పాల్గొన్న తరువాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇన్ఫెక్షన్స్‌తో పాటు కొన్ని ఇతర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే, అలాంటి ఇబ్బందులను నివారించడానికి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం.

  • Apr 09, 2023, 23:02 PM IST

Things To Do And Avoid After Intercourse: పిల్లలు కావాలని కోరుకునే వారు మినహాయించి.. మిగతా వారు శృంగారంలో పాల్గొన్న తరువాత మూత్ర విసర్జన చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్స్‌ని నివారించవచ్చు. సెంట్ వాడటం మానేయాలి. నొప్పిగా లేదా అసౌకర్యంగా ఉన్నట్టయితే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం, వదులుగా ఉండే బట్టలు ధరించడం వంటి కొన్ని అంశాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఇంకెన్నో అంశాల గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.

1 /7

Things To Do And Avoid After Intercourse: మూత్రవిసర్జన : శృంగారంలో పాల్గొన్న తరువాత మూత్రవిసర్జన చేయడం అనేది ఒక రకంగా చాలా ముఖ్యం. ఒకవేళ సంభోగం కారణంగా మీ మూత్ర నాళంలోకి ఏదైనా బ్యాక్టీరియా ప్రవేశించినట్టయితే.. ఆ బ్యాక్టీరియాను బయటకు పంపింగ్ చేయడానికి మూత్రవిసర్జన ఎంతో ఉపయోగపడుతుంది. శృంగారం తర్వాత యూరినేషన్ చేయడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) బారిన పడకుండా నివారిస్తుంది.

2 /7

Things To Do And Avoid After Intercourse: డౌచింగ్ చేయకూడదు: డౌచింగ్ అంటే యోనిని శుభ్రం చేయడానికి నీరు లేదా ఏవైనా ఇతర లిక్విడ్ సొల్యూషన్స్ ఉపయోగించడం. కొంతమంది తెలియక అతి జాగ్రత్తతో చేసే ఈ పని వల్ల యోనిలో ఇన్ఫెక్షన్లు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది.

3 /7

Things To Do And Avoid After Intercourse: సెంట్ వాసన కలిగిన ప్రోడక్ట్స్ ఉపయోగించకూడదు : జననేంద్రియం చుట్టూ సబ్బు, ఔషదాలు లేదా పర్‌ఫ్యూమ్ వంటి సువాసన కూడిన కాస్మెటిక్స్ ఉత్పత్తులను ఉపయోగించకూడదు. అలా చేయడం వల్ల యోనిలో ఉండే సహజ pH బ్యాలెన్స్‌ దెబ్బతిని యోనిలో చికాకు లేదా ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.

4 /7

Things To Do And Avoid After Intercourse: నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటే లైట్ తీసుకోవద్దు: మీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు లేదా ఆ తరవాత నొప్పిగా ఉన్నా లేక అసౌకర్యంగా ఉన్నా.. అలాంటి సమస్యలను లైట్ తీసుకోవద్దు. మీ భాగస్వామితో మాట్లాడి అందుకు గల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా అవసరమైతే సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోండి.

5 /7

Things To Do And Avoid After Intercourse: టైట్‌గా ఉండే దుస్తులు ధరించ వద్దు: సెక్సులో పాల్గొన్న తరువాత బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల కలిగే చమ్మ బ్యాక్టీరియా పెరుగుదలకు కారణం అవుతుంది.

6 /7

Things To Do And Avoid After Intercourse: విపరీతంగా అలిసిపోయే పనులు చేయొద్దు : సెక్సులో పాల్గొన్న తరువాత మీ శరీరానికి విశ్రాంతి అవసరం. శారీరకంగా కొంత విశ్రాంతి తీసుకోవాలి. శృంగారంలో పాల్గొన్న వెంటనే శారీరకంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే పనులు చేయడం వల్ల కొన్నిసార్లు ఊహించని ఇబ్బుందులు ఎదురవుతాయి. 

7 /7

Things To Do And Avoid After Intercourse: ఇలాంటి విషయాలన్నీ గుర్తుంచుకుని నడుచుకుంటే మీ సెక్సువల్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయడంతో పాటు హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు ఇది కూడా చదవండి : Anushka Sharma To Vini Raman: బెంగళూరు జట్టులో స్టార్ ప్లేయర్స్.. వారి లైఫ్ పార్ట్‌నర్స్ ఫోటోలు ఇది కూడా చదవండి : Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ఫ్యూచర్‌లో ఇలా ఉండబోతోందా ఇది కూడా చదవండి : Maruti Suzuki Fronx: ఫ్రాంక్స్ కారు ధర.. మైలేజ్.. ఇంజన్.. ఫీచర్స్.. దర్జాలో రారాజు.. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!   స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe  మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK