sonu sood temple in telangana - In Pics: సోనూ సూద్ సినిమాల్లో నటించేది విలన్‌గా అయినప్పటికీ.. నిజ జీవితంలో అప్పు చేసి మరి.. ఎంతో మందికి సాయం చేసి అందరి దృష్టిలో రియల్ హీరోగా, కలియుగ కర్ణుడిగా నిలిచారు.
మార్చి నెలలో విధించిన కరోనావైరస్ లాక్‌డౌన్ (Corona Lockdown) నాటి సమయంలో సోనూసూద్ (Sonu Sood).. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులకు అండగా నిలిచి వారిని స్వస్థలాలకు పంపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.
అంతేకాకుండా ఆపదలో ఉన్నామంటూ తనను సంప్రదించిన వారందరికీ సాయం చేస్తూ రియల్ లైఫ్ హీరోగా, ఆపద్భాంధవుడిగా నిలుస్తున్నారు సోనూసూద్.
తాజాగా తెలంగాణ (Telangana) ప్రజలు సోనూసూద్ గౌరవార్థంగా ఆలయాన్ని సైతం నిర్మించారు. సిద్దిపేట (Siddipet) జిల్లాలోని దుబ్బాతండా ప్రజలు ఆయన చేసిన సేవలకు గుర్తుగా గుడికట్టారు.
సోనూసూద్ విగ్రహం తయారు చేసిన శిల్పి, స్థానికుల సమక్షంలో ఆదివారం ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు జై హో సోనూసూద్.. అంటూ నినాదాలు చేసి పూజలు చేశారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..