Telangana RTC Offer: తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్. ఒకవేళ మీరు కూడా సాగర్ సోయగాలు తనివితీర చూడానుకుంటే మీకు ఇది గుడ్ న్యూస్. శ్రీశైలం గేట్లు ఎత్తిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకృతి ప్రేమికులు వాటని దర్శించడానికి చాలామంది వెళ్లారు. ఆ తర్వాత నాగర్జున సాగర్ గేట్లు ఎత్తివేయడంతో చాలామంది సాగర్ సోయగాలు చూడటానికి క్యూకట్టారు
తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నాగర్జున సాగర్ వెళ్లాలనుకునేవారికి మంచి అవకాశం అందిస్తోంది. నాగర్జున సాగర్ గేట్లు ఎత్తడంతో చాలామంది సాగర్ సోయగాలు చూడటానికి వస్తున్నారు. వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
నాగర్జున సాగర్ డ్యాం పూర్తి స్థాయిలో నిండటంతో మంగళవారం నుంచి 20 గేట్లు ఎత్తేశారు. ఈ నేపథ్యంలో సాగర సోయగాలు చూడాలనుకునే ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పర్యాటకుల తాకిడి కూడా పెరగడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నాగర్జున సాగర్ గేట్లు అన్ని ఎత్తేయడంతో పాలసముద్రంలా మైమరిపించే దృశ్యాలను తనివితీర చూడటానికి వెళ్లే టూరిస్టులకు మార్గం మరింత సుగమం కానుంది. తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాప్ నుంచి నాగర్జున సాగర్‌కు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది.
నల్గొండ ఆధ్వర్యంలో ఈ బస్సులు నడుపుతున్నట్లు మేనేజర్ శ్రీలత తెలిపారు. ఆర్టీసీ బస్సు వేళాలను కూడా ప్రకటించారు. హైదరాబాద్ నుంచి నాగర్జున సాగర్‌కు ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి. రోజులో వివిధ సమయాల్లో బస్సులను అందుబాటులో ఉంచింది.
ఉదయం 5, 6.45 నిమిషాలకు, 7.15, 7.30. 8.00, 9.45, 10.45, 2.30, 5.00. 5.40 నిమిషాలకు ఎంజీబీఎస్ నుంచి నాగర్జున సాగర్‌కు వెళ్లనున్నాయి. దీంతో సాగర్ సోయగాలు చూడాలనుకునేవారు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.