Telangana Singareni employees: తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ పాలనతో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హమీలను నెరవేర్చే దిశలో ముందుకు పోతుంది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగుల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలోని సింగరేణి గనుల డెవలప్ మెంట్ కోసం సీఎం రేవంత్ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని గనుల ద్వారా మనకు విద్యుత్ తో పాటు, బొగ్గును విక్రయించడం ద్వారా ఆదాయం కూడా లభిస్తుంది.
సింగరేణి కాలరీస్ లో చాలా మంది కార్మికులు తమ ప్రాణాలను సైతం ఎదురొడ్డి మరీ గనుల్లో పనిచేస్తుంటారు. అలాంటి కార్మికులకు రేవంత్ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది.
సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు దీపావళి పండగకు ముందే అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అదిరి పోయే వార్త చెప్పారు.
దీపావళి వేళ సింగరేణి కార్మికులు కోసం.. బోనస్ కింద రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా.. ప్రతి కార్మికుని ఖాతాలో(శుక్రవారం) రూ. 93,750. జమఅవుతున్నట్లు సమాచారం. దీంతో సింగరేణి కార్మికులు మాత్రం ఫుల్ సంబరాల్లో ఉన్నట్లు తెలుస్తొంది.