Murari Re Release: గత కొన్నేళ్లుగా తెలుగులో పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఎక్కువై పోయింది. మొదట్లో రీ రిలీజ్ లను ప్రేక్షకులు ఆదిరించారు. కానీ రాను రాను మాత్రం తెలుగులో ఈ రీ రిలీజ్ లపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గించింది. కానీ మహేష్ బాబు నటించిన ‘మురారి’ మూవీ రీ రిలీజ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
Murari Re Release: పాత బ్లాక్ బస్టర్స్ క్లాసిక్స్ మూవీలను రీ రిలీజ్ చేయడం గత రెండేళ్లుగా ఎక్కువైపోయింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ ఎక్కువ రీ రిలీజ్ లో ఎక్కువ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా ఈ రికార్డుకు బ్రేక్ చేస్తూ మహేష్ బాబు నటించిన ‘మురారి’ రీ రిలీజ్ లో బ్రేక్ చేసిందనే చెప్పాలి.
మహేష్ బాబు హీరోగా నటించిన 4వ చిత్రం. కృష్ణవంశీ దర్శకత్వంలో కృష్ణతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎన్.రామలింగేశ్వరావు నిర్మించారు. ఆయనతో పాటు ఎన్. దేవీ ప్రసాద్, గోపీ నందిగం ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమా 2001 ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది.
ఒక కుటుంబానికి సంబంధించిన శాపం నేపథ్యంలో కృష్ణవంశీ ఈ సినిమాను ఎంతో రీసెర్చి చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే కథానాయికగా నటించింది. అంతేకాదు ఈ సినిమా మహేష్ బాబు తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన బాణీలు మ్యూజికల్ హిట్ గా నిలిచింది.
మరోవైపు హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో ‘మురారి’ సినిమా 175 రోజులకు పైగా నడిచింది. మహేష్ బాబు కెరీర్ లో తొలి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత సుదర్శన్ 35 ఎంఎంలో ‘అతడు’, పోకిరి’ సినిమాలు కూడా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవడం విశేషం.
తాజాగా ‘మురారి’ సినిమాను మహేష్ బాబు బర్త్ డే అయిన ఆగష్టు 9న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే. .ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ ను బుక్ మై షోలో ఉంచగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు కోటి రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు టర్ేడ్ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ. 2 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసి సంచలనం రేపుతోంది. ఇప్పటికే బుక్ మై షోలో 40 వేలకు పైగా టికెట్ సేల్స్ తో రీసెంట్ టైమ్ లో ఏ సినిమాకు లేని హైప్ ‘మురారి’ మూవీకి క్రియేట్ అయిందనే చెప్పాలి.
ఓవరాల్ గా రిలీజ్ కు రెండు రోజులు ముందు ఈ సినిమా రూ. 3 కోట్లకు పైగా గ్రాస్ వసూల్లతో మహేష్ బాబు ‘మురారి’ మూవీ రీసెంట్ టైమ్ రీ రిలీజ్ మూవీస్ లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం విశేషం.