Pan India Director: ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా.. పట్టకపోతే.. ఇతను ప్రస్తుతం మన దేశంలో ప్యాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అంతేకాదు ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే గుర్తు పట్టారా.. లేకపోతే ఈ దర్శకుడు ఎవరో మీరే చూడండి..
రాజమౌళి ప్రస్తుతం తెలుగు సినిమా కాదు కాదు.. భారతీయ సినిమాకు పర్యాద పదంగా మారాడు. కే.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘శాంతి నివాసం’ సీరియల్ ద్వారా దర్శకుడిగా ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా ‘స్టూడెంట్ నెం.1’ మూవీతో దర్శకుడిగా మారారు. అక్కడ నుంచి ఆస్కార్ వరకు రాజమౌళి ప్రస్థానం కొనసాగుతూనే ఉంది.
స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 20 యేళ్ల కెరీర్ లో దాదాపు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
బాహుబలి సిరీస్ తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటతో తెలుగు సినిమా అనే కంటే భారతీయ సినిమాకు ఆస్కార్ తెచ్చిపెట్టిన ఘనుడుగా ఖ్యాతి గడించాడు జక్కన్న.
రాజమౌళి కెరీర్ లోని ముఖ్య ఘట్టాలకు అద్దం పట్టేలా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మోడరన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఈ నెల 2వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాదు మోడరన్ మాస్టర్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ ట్రెండింగ్ కొనసాగుతోంది.
కెరీర్ ప్రారంభంలో ఒక ప్యాషనేట్ యంగ్ డైరెక్టర్ గా, ఆ తర్వాత లార్జర్ దేన్ లైఫ్ మూవీస్ తెరపైకి తీసుకొచ్చిన బిగ్ డైరెక్టర్ గా, ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గెలిచి ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చుకున్న మోస్ట్ సెలబ్రేటెడ్ భారతీయ దర్శకుడిగా రాజమౌళి కెరీర్ లోని ప్రతి దశను అందంగా చూపించింది మోడరన్ మాస్టర్స్ ప్రత్యేక డాక్యుమెంటరీ.
అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్, ఫిల్మ్ కంపానియన్ రాజమౌళి సినీ ప్రయాణంలో ఈ సిరీస్ ను నిర్మించాయి. రాఘవ్ ఖన్నా డైరెక్ట్ చేశారు. మోడరన్ మాస్టర్స్ లో సినిమా మేకింగ్ పట్ల ఎస్ఎస్ రాజమౌళి సెపరేట్ మేకింగ్ స్లైల్. అంకితభావం గురించి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానాలు చెప్పే విధానం ఆకట్టుకుంటుంది.
వీరితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్, హాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ మేకర్స్ రూసో బ్రదర్స్, జేమ్స్ కామోరూన్ రాజమౌళి టేకింగ్ గురించి చెప్పిన మాటలు కొత్తగా వచ్చే దర్శకులకు ఇన్ స్పిరేషన్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.