Sridevi - Boney Kapoor Love Story: సినిమాలకు మించిన ట్విస్టులతో శ్రీదేవి, బోనీ కపూర్‌ల లవ్ స్టోరీ.. పెళ్లికి ముందే అలా..

Sridevi - Boney Kapoor Love Story: అతిలోకసుందరి శ్రీదేవి .. తన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఆ సూత్రాన్ని అక్షరాల ఫాలో అయింది. తెలుగు సహా దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఏలిన ఈమె.. ఆపై బాలీవుడ్‌లో కూడా నంబర్ వన్ హీరోయిన్‌గా ప్యాన్ ఇండియా లెవల్లో అప్పట్లోనే సత్తా చాటింది. ఇక ఈమె సినిమాలే కాదు.. ప్రేమ, పెళ్లి  విషయాల్లో సినిమాలకు మించిన ట్విస్టులున్నాయి.

 

1 /7

గోవింద.. గోవిందా సినిమాలో వేటూరి గారు చెప్పినట్టు.. పూల చుక్కలు.. కొన్ని తేనె చుక్కలు.. రంగిరిస్తవో.. ఇలా వమ్ము చేస్తవో.. భూలోకం ఇలాంటి సిరి చూసి ఉండదు. నిజంగానే శ్రీదేవి లాంటి కథానాయికను ఎవరు చూసుండరు.

2 /7

బోని కపూర్ ఫస్ట్ వైఫ్ పేరు మోనా కపూర్. అనారోగ్య కారణాలతో ఆమె కన్నుమూసింది. ఇక పెళ్లికి ముందే మోనాకు శ్రీదేవికి మంచి సత్సంబంధాలున్నాయి. ఈ కారణంగానే శ్రీదేవి ఇంట్లో గెస్ట్‌గా ఉండేందుకు మోనా ఒప్పుకుంది. 

3 /7

తెలుగు, తమిళం సహా దక్షిణాదిలో సత్తా చాటిన శ్రీదేవి.. హిందీలో 'హిమ్మత్‌వాలా' సినిమాతో స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత చాందినీ, మిస్టర్ ఇండియా, నాగిన్, చాల్బాజ్, జుదాయి, లాడ్లా, ఖుదాగవా వంటి సినిమాల్లో తన నటనతో మెప్పించింది.

4 /7

శ్రీదేవి వృత్తిగత జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం ఎంతో ఆసక్తికరం అని చెప్పాలి. ఈమె ముందు ప్రముఖ బాలీవుడ్ హీరో మిథున్ చక్రబర్తితో కొన్నేళ్లు డేటింగ్‌లో ఉంది. ఆ తర్వాత వీళ్లిద్దరు ప్రేమ బ్రేకప్ అయింది. ఆ తర్వాత శ్రీదేవి జీవితంలోకి బోనీ కపూర్ ఎంట్రీ ఇచ్చాడు. వీరి ప్రేమకథలో సినిమాకు మించిన ట్విస్టులున్నాయి.

5 /7

ఆ రోజుల్లో శ్రీదేవి, మిథున్ చక్రబర్తితో గాఢ ప్రేమలో ఉంది. బోనీ కపూర్ కూడా మోనాతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే శ్రీదేవి, బోనీ కపూర్‌తో సఖ్యతగా ఉండటం చూసి మిథున్ చక్రబర్తికి శ్రీదేవిపై అనుమానాలు కలిగాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి ఓ సందర్భంలో శ్రీదేవి.. బోనీ కపూర్‌కు రాఖీ కట్టింది.

6 /7

కానీ ఆ తర్వాత బోనీ కపూర్ నిర్మాణంలో అనిల్ కపూర్ హీరోగా  శేఖర్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మిస్టర్ ఇండియా' సినిమా బోనీ, శ్రీదేవిల మధ్య సాన్నిహిత్యం పెరిగేలా చేసింది. అప్పట్లో తల్లిని కోల్పోయిన శ్రీదేవికి బోనీ కపూర్ అండగా నిలబడ్డాడు. అన్ని విధాల సహాయ సహకారాలు అందించాడు. ఆ తర్వాత బోనీ కపూర్ నిర్మాణంలో శ్రీదేవి పలు సినిమాల్లో కథానాయికగా నటించింది.

7 /7

ఆ తర్వాత బోనీ కపూర్, శ్రీదేవి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత శ్రీదేవి పెళ్లికి ముందే గర్భం దాల్చింది. జాన్వీ కపూర్ పుట్టిన తర్వాత బోనీ కపూర్, శ్రీదేవి పెళ్లి చేసుకున్నారు. అలా రాఖీతో మొదలైన వీరి ప్రేమ.. పెళ్లితో ఎండ్ కార్డ్ పడింది.