Sri Rama Navami 2024: తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రలో మెప్పించిన హీరోలు..

Sri Rama Navami 2024: తెలుగు తెరకు రామాయాణానికి మంచి అనుబంధమే ఉంది. తెలుగు తెరపై  వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో రాలేదు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఎవరెవరు  శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారో మీరు ఓ లుక్కేయండి.

1 /8

ప్రభాస్ (Prabhas): రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ తొలిసారి శ్రీరాముడి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.

2 /8

బాలకృష్ణ ( Balakrishna): శ్రీరామరాజ్యం సినిమాలో పూర్తి స్థాయిలో రాముడి పాత్రలో నటించి మెప్పించారు నందమూరి బాలకృష్ణ. అంతకు ముందు కొన్ని సినిమాల్లో కేవలం పాటల్లో రాముడి పాత్రల్లో కనిపించారు.

3 /8

సుమన్ (Suman): టాలీవుడ్ సీనియర్ సుమన్.. భద్రాచలం రామ మందిరం నేపథ్యంలో తెరకెక్కిన 'శ్రీరామదాసు'లో రాముడి పాత్రలో నటించడం విశేషం.

4 /8

శ్రీకాంత్ (Srikanth): కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవుళ్లు' మూవీలో శ్రీకాంత్ కాసేలా శ్రీరామచంద్రుడి పాత్రలో నటించారు.

5 /8

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR): నందమూరి తారకరామారావు జూనియర్ తన జీవితాన్ని రాముడి పాత్రతో ప్రారంభించడం విశేషం. అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ బాల రాముడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు.

6 /8

శోభన్ బాబు (Shobhan Babu): నట భూషణ శోభన్ బాబు బాపు దర్శకత్వంలో తెరకెక్కిన 'సంపూర్ణ రామాయణం'లో తొలిసారి రాములోరి పాత్రలో నటించి మెప్పించారు.

7 /8

NTR (ఎన్టీఆర్) :  తెలుగు ప్రేక్షకులకు రాముడంటే ఎన్టీఆర్. తెలుగు తెరపై రాముడి పాత్రలో ఆయన జీవించిన విధానంతో ఆయన వెండితెర రాముడిగా కీర్తి ఘడించాడు. అలనాటి 'సంపూర్ణ రామాయణం' నుంచి శ్రీరామపట్టాభిషేకం వరకు చాలా సినిమాల్లో రాముడి పాత్రల్లో నటించి మెప్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది.

8 /8

అటు తెలుగు తెరపై అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, హరనాథ్, రవి సహా పలువురు హీరోలు కూడా శ్రీరామ చంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారు.