Sreeleela: చీరకట్టులో మరింత అందంగా శ్రీలీల.. లేటెస్ట్ పిక్స్ చూస్తే కుర్రాళ్లు తట్టుకోలేరేమో..

Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో బుల్లెట్‌లా వచ్చి రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న తార. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతోంది. ఈ ఇయర్  త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా సరైన విజయం సాధించపోయినా.. శ్రీలీల డాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

1 /6

శ్రీలీల విషయానికొస్తే..  2001లో జూలై 14న అమెరికాలో జన్మించింది. వీళ్లది తెలుగు ఫ్యామిలి కావడం విశేషం. ఈమె తల్లి ప్రముఖ గైనకాలిజిస్ట్. విదేశాల్లో పుట్టిన ఈమె బెంగళూరులో చదువు పూర్తి చేసుకుంది. పెళ్లిసందడి కంటే ముందు కిస్, భారతే వంటి కన్నడ సినిమాల్లో తన లక్ పరీక్షించుకుంది.

2 /6

తెలుగులో శ్రీలీల..  దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' మూవీతో పరిచయం అయింది. మొదటి సినిమాతోనే  తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

3 /6

 శ్రీలీల.. హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ పాపులర్ అయింది. ప్రస్తుతం తెలుగులో  వరుస అవకాశాలతో  క్రేజీ భామగా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  

4 /6

శ్రీలీల నటిగానే కాకుండా.. తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో  నిలిచింది. ఇక మాస్ మహారాజ్ రవితేజతో చేసిన 'ధమాకా'తో మూవీతో శ్రీలీలకు స్టార్ డమ్ వచ్చింది.

5 /6

లాస్ట్ ఇయర్..  శ్రీలీల స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రాలతో పలకరించింది. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో నటించిన 'భగవంత్ కేసరి' సినిమా మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచింది. మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.

6 /6

హీరోయిన్‌గా కేవలం యంగ్ హీరోల సరసనే కాకుండా టాప్ స్టార్స్ సరసన ఛాన్స్ కొట్టేస్తూ దూసుకుపోతుంది. ఈ యేడాది మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. త్వరలో పవన్ కళ్యాణ్‌.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కథానాయిగా నటిస్తోంది. ఈ సినిమాపై శ్రీలీల చాలా ఆశలే పెట్టుకుంది.