Sravana masam 2024: శ్రావణ శనివారం ప్రత్యేకత.. ఏ పూజ చేస్తే మంచిది.. చేయకూడని పనులు..

Sravana masam saturday 2024: శ్రావణ మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసమంతా పండుగల మాసమని కూడా చెప్పవచ్చు. శ్రావణ మాసంలో శనివారంకు అత్యంత ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు.
 

1 /6

శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక  పండుగ ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారం, శుక్రవారం, శనివారాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా.. ఈరోజున తమ ఇష్టదైవాలను ప్రత్యేకంగా కొలుచుకుంటారు. ఈరోజుల్లో ఉపవాసాలు కూడా చేస్తారు.  

2 /6

శ్రావణ మాసంమంటే శివకేశవులకు ఎంతో ప్రీతీకరమైన మాసం. విష్ణుదేవుడి నక్షత్రం శ్రావణం. అందుకే ఈ మాసంలో విష్ణువును ప్రత్యేకంగా కొలుచుకుంటారు. అంతేకాకుండా.. శనివారం రోజు చాలా మంది ఉపవాసాలు సైతం చేస్తుంటారు. శ్రావణ మాసం శనివారం రోజు కొందరు విష్ణుదేవుడ్ని పూజిస్తే, మరికొందరు నర్సింహా స్వామిని పూజించుకుంటారు. మరికొందరు ఆంజనేయ స్వామిని, శనిదేవుడ్ని సైతం కొలుచుకుంటారు.  

3 /6

ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి శనివారం అత్యంత ఇష్టమైన రోజంట. ఏడు శనివారాల వ్రతం కూడా చాలా మంది ఆచరిస్తారు. ఈ రోజున ప్రత్యేకంగా పూలతో అలంకరిస్తారు. అంతేకాకుండా.. స్వామివారికి ప్రత్యేకంగా పులిహోర నైవేద్యం చేసి మరీ పెడతారు. పులిహోర, లడ్డు ప్రసాదమంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమంట.  

4 /6

అందుకే తిరుపతిలో ప్రత్యేకంగా లడ్డును,భక్తులకు స్వామివారి ప్రసాదంగా ఇస్తుంటారు. అంతేకాకుండా.. చాలా మంది పప్పు, బెల్లంలను కూడా వెంకటేశ్వర స్వామికి, నర్సింహా స్వామికి నైవేద్యంగా సమర్పంచుకుంటారు.

5 /6

ఏలినాటి శని, అర్ధష్టమ, సాడేసాతి శని ప్రభావం ఉన్న వాళ్లు ఏడు శనివారాల వ్రతం చేస్తే ఆదోష ప్రభావమంతా మాయమౌతుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలతో పూజలు చేయాలి. శనిదేవుడికి నూనెతో అభిషేకం చేయాలి.

6 /6

శనివారంరోజున వస్త్రదానం చేయాలి, నవధాన్యాలను దానం చేయాలి. నల్లని వస్తువులను దానంగా ఇవ్వాలి. అదే విధంగా శనివారం రోజున ఇనుము, ఉప్పు, కొత్త చెప్పులు, నల్లని బట్టలు, నూనెలను మన ఇంటికి తెచ్చుకోకూడదు..   (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)