Sprouted Onions: ఈ ఉల్లిపాయలు ఆరోగ్యానికి హానికరం.. వండుకునే ముందు తస్మాత్ జాగ్రత్త..!

Is Sprouted Onions Harmful: ఉల్లిపాయలు నిత్యం మన ఇంట్లో అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే అవి నిత్యవసర వస్తువులు ఒకటి ఉల్లిపాయలు లేనిదే కూర చేసుకోలేని పరిస్థితి. అయితే ఉల్లిపాయలు మనకు కూరల రుచిని పెంచడమే  కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు కలిగి ఉంటుంది.
 

1 /5

 అందుకే విస్తృత స్థాయిలో ఉల్లిపాయలను ఉపయోగిస్తాం. వీటిని సరైన పద్ధతిలో నిల్వ చేస్తే కొన్ని నెలల పాటు పాడవ్వకుండా ఉంటాయి. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉల్లిపాయలను తీసుకోకూడదు. అవి ఎలాంటి ఉల్లిపాయలు తెలుసుకుందాం.  

2 /5

ఉల్లిపాయలు ఎన్నో నెలల పాటు మన ఇంట్లో నిల్వ ఉంటాయి దీంతో ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపవు. కానీ వీటిని సరైన పద్ధతిలో నిల్వ చేయాలి అయితే కొన్ని రకాల ఉల్లిపాయలపై నల్ల మచ్చలు ఆ ఉల్లిపాయలు మొలకెత్తడం వంటివి చూస్తూ ఉంటాము. ఇలాంటి ఉల్లిపాయలు తినవచ్చా? ఈ మొలకెత్తడం కేవలం ఉల్లిపాయలకు మాత్రమే పరిమితం కాదు మనం ఇలాంటి ప్రభావాన్ని బంగాళదుంపల్లో కూడా చూస్తాం .  

3 /5

ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ప్రయోజనకరమా ఇలాంటి ప్రమాదాలను తీసుకువస్తాయి తెలుసుకుందాం. మొలకెత్తిన ఉల్లిపాయలలో కాకుండా వెల్లుల్లి, బంగాళదుంప లో కూడా ఇలా మొలకెత్తడం చూస్తాము. వెజిటేబుల్ లైఫ్ సైకిల్స్ లో భాగంగా ఇలా జరుగుతుంది.  సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ఉల్లిపాయలు మొలకెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా కాస్త వెచ్చగా ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే ఉల్లిపాయలను కానీ బంగాళాదుంపలు వెల్లుల్లి మొలకెత్తడం ప్రారంభిస్తాయి.  

4 /5

ముఖ్యంగా చలికాలం వర్షాకాలంలో వీటిని మనం నిల్వ చేసుకుంటాం కాబట్టి ఇలా ఉల్లిపాయలు మొలకెత్తడం ప్రారంభిస్తాయి. ఇలా మొలకెత్తిన ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల శరీరానికి ఏ అనారోగ్య సమస్యలు రావు కానీ వాటిని పాడవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఉల్లిపాయలపై నల్లని బూజు వంటి పదార్థం పేరుకొని ఉంటే అలాంటి ఉల్లిపాయలు తినకపోవడమే బెట్టర్ ఆ పైన లేయర్ ని తీసేసి తీసుకోవాలి వీటిని అలాగే తింటే కొన్ని రకాల కడుపు సంబంధిత వ్యాధులు వస్తాయి.

5 /5

 కానీ మొలకెత్తిన ఉల్లిపాయలు బంగాళదుంప ఉల్లిపాయలతో ఎలాంటి ప్రభావం ఉండదు. ఇలా మొలకెత్తిన ఉల్లిపాయలు తమ నేచురల్ రుచిని కోల్పోతాయి కాస్త ఛేదుగా అనిపిస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉల్లిపాయలు ఆ మెత్తగా పాడైపోయి బూజు పేరుకొని ఉన్న ఉల్లిపాయల అనారోగ్య సమస్యలు తీసుకొస్తాయి ఇలాంటి వాటిని శరీరంలో విష పదార్థం తీసుకున్నట్లే అవుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)