Special Trains: దసరా, దీపావళి సందర్భంగా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే భారీ కానుక.. ఏపీ, తెలంగాణ ప్రయాణీకులకు పండగే పండగ..!!

Special Trains On Dussehra: తెలుగు రాష్ట్రాలకు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే భారీ కానుకను ప్రకటించింది. దీంతో ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణీకులకు ఇది పెద్ద శుభవార్తే కానుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
 

1 /6

తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగలు అయిన దసరా, దీపావళి సందర్భంగా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే భారీ శుభవార్త అందించింది. పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లను ప్రకటించి ఏపీ, తెలంగాణ రైలు ప్రయాణీకులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించింది.  

2 /6

నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే రైళ్లలో జర్నీ చేయడం సులభతరం, సుఖవంతం. అయితే, పండుగల సమయంలో కిక్కిరిసిపోతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ప్రయాణం చేయడం అంత సులభం కాదు. ఈ ప్రత్యేక పండుగ దినాల్లో ఇతర బస్సులు వంటివి కూడా భారీగా రేట్లను పెంచుతాయి.  

3 /6

ఈ సందర్భంగా ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న సౌత్‌ సెంట్రల్‌ రైల్వే దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు అక్టోబర్‌ 10 నుంచి నవంబర్‌ వరకు అందుబాటులో ఉండనున్నాయి. దీంతోపాటు మరికొన్ని ప్రత్యేక రైళ్లను కూడా పొడిగించింది. ఈ ప్రత్యేక రైళ్ల జాబితాలో ఎక్కువ శాతం తిరుపతికి కేటాయించింది.  

4 /6

కాచిగూడ నుంచి తిరుపతి వెళ్లే రైలు (07653), తిరుపతి నుంచి కాచిగూడ (07654), కాకినాడ - సికింద్రాబాద్‌ (07122); సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ (07188) ప్రయాణించనున్నాయి. అంతేకాదు మచిలీపట్నం నుంచి తిరుపతి ప్రత్యేక రైళ్లు కూడా నడవనున్నాయి.  

5 /6

కాచిగూడ నుంచి మధురై (07191), మధురై నుంచి కాచిగూడ (07192), కాచిగూడ నుంచి నాగర్‌ కోయిల్‌ (07435), నాగర్‌ కోయిల్ నుంచి కాచిగూడ (07436), సికింద్రాబాద్‌ నుంచి కొల్లం(07193), కొల్లం నుంచి సికింద్రాబాద్‌ (07194) రైల్లు నడవనున్నాయి. ఇక సికింద్రాబాద్‌ నుంచి రామనాథపురం (07695), రామనాథపురం నుంచి సికింద్రాబాద్‌ (07696), షాలిమార్ నుంచి సికింద్రాబాద్, తిరుపతి నుంచి షిర్డి సాయినగర్‌ కు కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.  

6 /6

సెప్టెంబర్‌ 1 నుంచి నెల చివరి వరకు సంబల్‌పూర్‌ నుంచి నాందేడ్‌ వెళ్లే రైలు (20810)కు అదనంగా బోగీలను ఫిక్స్‌ చేయనున్నారు. ప్రయాణీకులు వీటిని దృష్టిలో పెట్టుకుని రైలు సేవలను వినియోగించుకోవాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కోరింది.