Shukra Vakri 2023: ఏదైనా ఒక రాశిలోకి గ్రహాలు తిరోగమనం చేసినప్పుడు పలు రాశుల వారికి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా ఈ క్రమంలో కొన్ని రాశుల వారు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపు జరగబోయే శుక్రుడు తిరోగమనను కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు చూద్దాం.
Shukra Vakri 2023: గ్రహాలు తిరోగమనం చేయడం కారణంగా చాలా రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న శుక్ర గ్రహం సింహరాశిలో జూలై 23వ తేదీన తిరోగమనం దశగా ప్రయాణం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై శుక్రుడి ప్రత్యక్ష ప్రభావం పడి వ్యక్తిగత జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి.
శుక్రుడి తిరోగమన ప్రభావం ముందుగా వృషభ రాశి వారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరు ఈ ప్రభావంతో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా లభించే అవకాశాలు ఉన్నాయి.
మిధున రాశి వారిపై కూడా శుక్రుడి తిరోగమన ప్రభావం పడబోతోందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా వీరికి ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా ఎలాంటి పనులైనా తొందరగా చేయగలిగే సామర్థ్యం పొందుతారు. ఇక ఉద్యోగాల్లో స్థిరపడినవారు స్థానచలనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ తిరోగమనం కారణంగా ధనస్సు రాశి వారికి రెట్టింపు ఆనందం కలుగుతుంది. వీరు తల్లిదండ్రుల మద్దతుతో అన్ని రకాల పనులను సులభంగా చేయగలుగుతారు. ఉద్యోగాల్లో పురోగతి లభించడమే కాకుండా ఉన్నత స్థానాల్లోకి ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక విద్యార్థులకు చదవాలని ఆసక్తి కూడా పెరుగుతుంది.
వృశ్చిక రాశి వారిపై కూడా శుక్రుడు తిరోగమన ప్రభావం పడబోతోంది. దీని కారణంగా ఈ రాశి వారి ఆదాయం రెట్టింపబడమే కాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత లభించే ఛాన్స్ కూడా ఉంది. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ క్రమంలో ఎలాంటి వ్యాధుల నుంచి అయినా ఉపశమనం లభిస్తుంది.
కర్కాటక రాశి వారికి ఈ క్రమంలో ఉద్యోగంలో మార్పులు వస్తాయి. ఈ రాశి వారు శుక్రుడి తిరోగమనం కారణంగా భారీ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తొందరలోనే మీ పిల్లల నుంచి శుభవార్తలు కూడా వింటారు. ఇక వీరి ఆదాయం పెరగడంతో కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. కుటుంబ జీవితంలో ఈ క్రమంలో ప్రశాంతత లభిస్తుందని జ్యోతిష్య శాస్త నిపుణులు చెబుతున్నారు.