Shani Dev: శని గ్రహం తిరోగమనంతో ఈ రాశులవారు 100 శాతం అదృష్టవంతులు కాబోతున్నారు..


Saturn Retrograde: శని గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రేమ జీవితంలో మరిచిపోని రోజులు వస్తాయి. 

  • Jan 03, 2024, 16:36 PM IST

 

Saturn Retrograde 2024: జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శని గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే..ధనలాభాలు కలవడమే కాకుండా జీవితంలో ప్రశాతంత లభిస్తుంది. అదే శని సాడే సతితో బాధపడితే జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో పాటు ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయి.
 

1 /5

ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో ఉన్నాడు. అయితే జూన్ నెలలో శని తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. జూన్ 30వ తేదీ మధ్యాహ్నం 12:35 గంటలకు శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. ఈ గ్రహం రివర్స్‌లో కదలడం వల్ల కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది.

2 /5

శని తిరోగమన కదలికల కారణంగా తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో విద్యార్థులకు ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కుటుంబం, స్నేహితులతో ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ జీవితంలో కూడా అనేక రకాల లాభాలు పొందుతారు.   

3 /5

శని రివర్స్ కదలడం వల్ల వృషభ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు కార్యాలయంలో ఊహించని లాభాలను పొందుతారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.  

4 /5

శనిగ్రహం తిరోగమనం కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారాలు చేసేవారు అనేక రకాల శుభవార్తలు వింటారు. దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి.  

5 /5

ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో ప్రయాణాలు కూడా చేస్తారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధఫడేవారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది. దీంతో పాటు కుటుంబతో ఎంతో ఆనందంగా ఉంటారు.