Secunderabad Agnipath Protests: రణరంగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌.. లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

Secunderabad Agnipath Protests Pictures goes Viral. అగ్నిపథ్‌తో తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. 
 

  • Jun 17, 2022, 13:50 PM IST
1 /8

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం ఘటనపై వివరాలను అమిత్‌షాకు వివరించారు.   

2 /8

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైల్వేశాఖ వివిధ జోన్లలో ప్రయాణించే రైలు సర్వీసుల్లో మార్పులు చేసింది. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. కొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసింది.   

3 /8

సికింద్రాబాద్‌లో ఆందోళన నేపథ్యంలో నాంపల్లి రైల్వే స్టేషన్‌ను పోలీసులు మూసేశారు. ప్రయానికులు రావొద్దని పోలీసులు హెచ్చరించారు.   

4 /8

ఆందోళనకారుల దాడిలో మూడు రైళ్లు ధ్వంసం అయినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పార్శిల్‌ రైలుతో పాటు అజంతా ఎక్స్‌ప్రెస్‌లో 2 బోగిలు దగ్ధం అయ్యాయని పేర్కొంది.  

5 /8

రైల్వేట్రాక్‌, ప్లాట్‌ఫామ్‌లు గందరగోళంగా మారిపోయాయి. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక అక్కడికి వచ్చిన ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.  

6 /8

ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అరంగట పాటు కొనసాగిన ఆందోళనతో రైలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. పార్సిల్‌ కార్యాలయంలో ఉన్న బైకులు, ఇతర సామన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.   

7 /8

అగ్నిపథ్‌తో తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. ఒక్కసారిగా విరుచుకుపడిన విద్యార్థులతో రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో యుద్ధవాతావరణం నెలకొంది.  

8 /8

సైన్యంలో తాత్కాలిక నియామకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్‌' విధానంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ రణరంగంగా మారింది.