Scarlet Fever: హైదరాబాద్‌లో పెరుగుతున్న స్కార్లెట్‌ ఫీవర్‌.. పిల్లల ఆరోగ్యంపై ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Scarlet Fever Symptoms And Precautions: ఇటీవల హెచ్ఎంపీ వైరస్‌ వ్యాప్తిస్తుంది అనడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే, దీంతో పెద్ద ప్రమాదం లేదు ఇది ఎప్పటి నుంచో ఉన్న వైరస్‌ అనడంతో కాస్త ఊరటనిచ్చింది. అయితే, తాజాగా హైదరాబాద్లో మరో కొత్త రకమైన జబ్బు వెంటాడుతుంది. అదే స్కార్లెట్ ఫీవర్ హైదరాబాద్ వ్యాప్తంగా పిల్లలకి వ్యాపిస్తుంది. ముఖ్యంగా 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు ఈ వ్యాధి కనిపిస్తుంది. అయితే  ఆరోగ్యశాఖ కొన్ని తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చింది.
 

1 /5

చలికాలంలో సీజనల్  జబ్బులు చుట్టుముడతాయి. అయితే హైదరాబాదులో పిల్లల్లో ముఖ్యంగా స్టార్లేట్ జ్వరం విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచించారు. వాటిని పాటిస్తే వ్యాధి వ్యాప్తిని తగ్గించడంతోపాటు నివారించవచ్చు.  

2 /5

ఇది గ్రూప్ ఏ స్ట్రెప్టోకోక్కర్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్  వల్ల వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఇది పిల్లల్లో కనిపిస్తుంది. కొన్ని లక్షణాలు ఐదు రోజులపాటు ఉంటాయి. స్కార్లెట్‌ వ్యాధి లక్షణాల్లో  జ్వరం, గొంతు నొప్పి, టాన్సిల్స్, శరీరంపై రాషెస్  స్ట్రాబెరీ టంగ్ వంటివి కనిపిస్తాయి.  

3 /5

ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే ముందుగా వైద్యులను సంప్రదించడం మేలు. 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు కనిపిస్తోంది. అయితే ఇది ముఖ్యంగా దగ్గు వల్ల వ్యాపిస్తుంది లేదా నీళ్లు, ఆహారం కాలుష్యం,   అపరిశుభ్రమైన నేలను తాకడం వల్ల ఈ వ్యాధి పిల్లల్లో త్వరగా వ్యాపిస్తుంది.  

4 /5

ఈ స్కార్లెట్‌ ఇన్ఫెక్షన్  బారిన పడకుండా ఉండాలంటే వ్యాధి సోకిన పిల్లల్ని 24 గంటల పాటు బయటకు పంపించకూడదు. అయితే వీటికి కొన్ని యాంటీబయోటిక్స్ ఉన్నాయి. కేవలం వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇవి పిల్లల గుండె, కిడ్నీ పై ప్రభావం చూపుతుంది. వైద్యులని సంప్రదించండి కానీ సొంత చికిత్స చేయకండి.  

5 /5

 ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటే పిల్లలను పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. తరచూ చేతులు కడుక్కోవడం ఇంకా వ్యాధి సోకిన పిల్లల నుంచి దూరంగా ఉంచడం, పర్సనల్ వస్తువులు ఉండాలి.  ముఖ్యంగా పిల్లలు తినే లేదా తాగే కప్పులు, గిన్నెలు, వాడే టవల్స్ వంటివి ప్రత్యేకంగా ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి .