Samantha- Raj: సమంత ప్రేమిస్తున్న రాజ్.. మన తిరుపతి వాడని మీకు తెలుసా..? దర్శకుడి గురించి ఆసక్తికర విషయాలు

More About Raj: సమంత దర్శకుడు  రాజ్ ని ప్రేమిస్తోందని.. నేషనల్ మీడియా కోడై కుస్తోంది. తాజాగా వీరిద్దరూ గతంలో తీసుకున్న ఫోటోలు సైతం వైరల్ అవుతూ.. అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో అసలు ఈ రాజ్ ఎవరు అనే విషయం పై నేటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అసలు ఇతను తెలుగోడా? హిందీ వాడా అని వెతుకుతున్నారు.. మరి ఈ దర్శకుడి గురించి మరిన్ని వివరాలు మీకోసం..

1 /5

నాగచైతన్య, సమంత.. ప్రేమించి, పెళ్లి చేసుకుని.. విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక వీరు విడిపోయి మూడు సంవత్సరాలు కావస్తుండగా.. నాగచైతన్య ఈమధ్య అని హీరోయిన్ శోభితతో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ క్రమంలో సమంత కూడా వేరే దర్శకులతో డేటింగ్ చేస్తోంది అన్న రూమర్స్ జోరు అందుకున్నాయి. 

2 /5

నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. దర్శకుడు రాజ్ తో సమంత డేటింగ్ చేస్తోంది అన్న వార్త తెగ వైరల్ అవుతుంది. మరి ఈ రాజ్ ఎవరు అనే దాని గురించి.. సమంత అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో రీసెర్చ్ చేస్తున్నారు. ఈ దర్శకుడు రాజ్ మరవరో కాదు.. సమంతా నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్ దర్శకుడు. అప్పట్లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో సమంత నటించడం వల్లే.. నాగచైతన్య విడిపోయాడన్న రూమర్స్ కూడా వచ్చాయి. 

3 /5

ఆ సంగతి పక్కన పెడితే.. ఫ్యామిలీ మాన్ తరువాత.. ఇప్పుడు మళ్లీ ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న సీటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా సమంత నటిస్తోంది. రాజ్.. మరో దర్శకుడు డికే అనే వ్యక్తితో కలిసి సినిమాలు తీస్తూ ఉంటారు.. అందుకే వీరిద్దరిని రాజ్ అండ్ డీకే అంటూ ఉంటారు. అతని పూర్తి పేరు రాజ్ నిడిమోరు.

4 /5

రాజ్ నిడిమోరు హిందీ వారు అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఇతను పుట్టి, పెరిగింది తిరుపతిలో. అతనితో సహదర్శకత్వం చేసే డీకే పుట్టింది చిత్తూరులో. అంటే వీరు మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారే. అయితే వీరిద్దరూ కూడా బాలీవుడ్లో డి ఫ్యామిలీ మెన్, గన్స్ అండ్ గులాబ్స్.. ఫార్జీ.. లాంటి వెబ్ సిరీస్ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. 

5 /5

అంతేకాదు రాజ్‌ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ లో.. ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం సమంత, రాజ్ ప్రేమాయణం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.