Independence Day 2024: రేపు భారత్‌తోపాటు ఈ 5 దేశాలకు కూడా ఇండిపెన్‌డెన్స్‌ డే.. ఆ దేశాలు ఏవో తెలుసా?

Independence Day 2024 Celebrations: రేపు మన భారత 78వ స్వాతంత్య్ర దినోతవం జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో స్కూళ్లు, ఆఫీసులలో జాతీయ  జెండాను ఎగురవేస్తారు. అయితే, మన దేశంతోపాటు మరో 5 దేశాలు కూడా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు జరుపుకోనున్నాయి. ఆ దేశాలు ఏవో తెలుసుకుందాం.
 

1 /6

మన దేశం ప్రతి ఏటా ఆగష్టు 15వ తేదీనా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. మన దేశంతోపాటు మరో 5 దేశాలు కూడా స్వాతంత్య్రం పొందినాయి.ఆ దేశాల జాబితా ఇదే..  

2 /6

సౌత్‌ కొరియా.. రేపు భారత్‌లోపాటు సౌత్‌ కొరియా కూడా రిస్టోరేషన్‌ ఆఫ్ లైట్‌ డే (Gwangbokjeol) వేడుకలు నిర్వహిస్తారు. జపాన్‌ నుంచి విముక్తి పొందినప్పటి నుంచి సౌత్‌ కొరియా ఈరోజు వేడుకలు నిర్వహిస్తోంది.

3 /6

నార్త్‌ కొరియా... మన దేశంతోపాటు రేపు స్వాతంత్య్ర దినోత్సవం జరపుకంటున్న మరో దేశం నార్త్‌ కొరియా. ఆగష్టు 15న లిపరేషన్‌ డే (Gwangbokjeol) జరుపుకుంటారు. వీళ్లకు కూడా జపాన్‌ పాలన నుంచి 1945లో విముక్తి లభించింది. అప్పటి నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తారు.

4 /6

రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో.. 1960 ఆగష్టు 15వ తేదీ నుంచి రిపబ్లిక్‌ ఆఫ్ ది కాంగో కూడా ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం పొందింది. అప్పటి నుంచి కాంగో కూడా ఈరోజున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుంది.

5 /6

బహ్రెయిన్‌..  భారత్‌తోపాటు స్వాతంత్య్ర వేడుకలు రేపు జరుపుకోనున్న మరో దేశం బహ్రెయిన్‌. 1971 ఆగష్టు 15న ఈ దేశం కూడా బ్రిటన్‌ పాలన నుంచి విముక్తి పొందింది. డిసెంబర్‌ 16న నేషనల్‌ డేను జరుపుకుంటారు.

6 /6

లిక్టెన్‌స్టెయిన్‌.. ఆగష్టు 15న నేషనల్‌ డే జరుపుకుంటున్న మరో దేశం లిక్టెన్‌స్టెయిన్‌. అక్కడి కాథలిక్‌ చర్చీలలో ఫీస్ట్ కూడా ఈరోజు జరుపుతారు.