Renuka swami case: అభిమానికి కరెంట్ షాక్ ఇచ్చి టార్చర్.. కన్నడ హీరో దర్శన్ ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Hero Darshan: కన్నడ హీరో తన అభిమాని రేణుక స్వామి హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బైటకు వస్తున్నాయి. ఇప్పటికే కోర్టు వీరికి పదిరోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించింది.

  • Jun 16, 2024, 14:57 PM IST
1 /6

కన్నడ నటుడు దర్శన్, పవిత్ర గౌడ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేణుక స్వామిని చిత్రకూట్ నుంచి కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి టార్చర్ చేసి మరీ చంపినట్లు పోలీసులు విచారణలో బైటపడింది. ఇప్పటికే ఈ కేసులో దర్శన్ , పవిత్రగౌడతోపాటు, మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

2 /6

మరోవైపు దర్శన్ చెప్పినట్లు తాము చేశామంటూ ఈ కేసులో ఉన్న మిగతా నిందితులు పోలీసులకు చెప్పారు. రేణుక స్వామి నోట్లో మాంసం బిర్యానీ కుక్కి మరీ టార్చర్ చేశారని మిగతా నిందితులు చెప్పినట్లు సమాచారం. రేణుక స్వామి వద్దని వేడుకుంటున్న.. కరెంట్ షాక్ సైతం ఇచ్చినట్లు అక్కడి వారు చెప్పారు.

3 /6

ఇక దర్శన్ వాదన మరో విధంగా ఉంది. తాను.. కేవలం వార్నింగ్ ఇచ్చేందుకు తీసుకు రమ్మన్నానని, కానీ వారు హత్య చేస్తారని అనుకోలేదని దర్శన్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. కేవలం రెండు దెబ్బలు మాత్రమే కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయానని ఆ తర్వాత తనకు ఏంతెలియదని కూడా దర్శన్ చెప్పుకొచ్చాడు.

4 /6

నటి పవిత్ర గౌడ పోలీసులు ఎదుట కన్నీళ్లు పెట్టుకుందంట. అసలు .. తాను ఘటన గురించి దర్శన్ కు చెప్పి పెద్ద తప్పు చేశానని, చెప్పకుంటే ఈరోజు ఇలాంటి ఘటన జరిగేది కాదని కూడా పోలీసుల విచారణలో కన్నీళ్లు పెట్టుకుదంట. ఇదిలా ఉండగా.. వీరికి కోర్టు జూన్ 20 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.

5 /6

రేణుక స్వామి మర్డర్ కేసులో.. 16 మందిలో తన కొడుకు ఉన్నాడని ఒక తండ్రి గుండెపోటుతో చనిపోయాడు. అతని అంత్యక్రియలు చిత్రపరిశ్రమ వారు దగ్గరుండి పూర్తిచేశారు. రేణుక స్వామి కుటుంబానికి కన్నడ చిత్ర పరిశ్రమ వారు.. ఐదు లక్షల రూపాయలు ఆర్ధిక సహయం అందించారు. 

6 /6

మరోవైపు కన్నడ నాట కూడా.. ఈ ఘటనపై తీవ్ర దుమారం కొనసాగుతుంది. నటుడు దర్శన్, పవిత్ర గౌడలకు కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల బీజేపీ నటుడు దర్శన్ కు టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిలపాలని చూసిందని వార్త వెలుగులోకి వచ్చింది.