Renault December 2024 discounts: Renault తన వాహనాలపై డిసెంబర్ 2024లో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో రెనాల్ట్ క్విడ్ కిగర్,ట్రైబర్ ఉన్నాయి. వీటిలో, కిగర్పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ తగ్గింపులో ఎక్స్ఛేంజ్ బోనస్ కార్పొరేట్ బోనస్ లాయల్టీ బోనస్‌లు ఉంటాయి. ఇండియన్ మార్కెట్లో రెనాల్ట్ వాహనాలపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.
Renault December 2024 discounts: చాలా కంపెనీలు ఏడాది చివరి నెలలో తమ వాహనాలపై డిస్కౌంట్లను ఇస్తాయి. అదేవిధంగా, రెనాల్ట్ కూడా తన వాహనాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను అందిస్తోంది. Renault Kwid, Kiger, Triber డిసెంబర్ 2024లో రూ. 75,000 వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది కంపెనీ . ఈ ఆఫర్ 2024 చివరి వరకు చేసిన బుకింగ్‌లు, డెలివరీలకు వర్తిస్తుందని తెలిపింది. ఈ మూడు రెనాల్ట్ వాహనాలపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.
రెనాల్ట్ క్విడ్: క్విడ్ బేస్-స్పెక్ RXE, మిడ్-స్పెక్ RXL (O) వేరియంట్లు మినహా, మిగతావన్నీ రూ. 20,000 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. దీనిపై, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 వరకు లాయల్టీ బోనస్ అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా, రెనాల్ట్ క్విడ్‌పై మొత్తం రూ. 45,000 వరకు తగ్గింపు లభిస్తుంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్లలో ఈ కారుపై రూ.65,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రెనాల్ట్ క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షల నుండి రూ. 6.45 లక్షల వరకు ఉంది.
రెనాల్ట్ ట్రైబర్: రెనాల్ట్ ట్రైబర్ పై మొత్తం రూ.60,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దాని బేస్-స్పెక్ RXE వేరియంట్ మినహా, మిగతావన్నీ రూ. 25,000 వరకు తగ్గింపును పొందుతున్నాయి.ట్రైబర్‌లో రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 వరకు లాయల్టీ బోనస్ అందుబాటులో ఉన్నాయి. లాయల్టీ బోనస్ దాని బేస్-స్పెక్ RXE వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. భారతీయ మార్కెట్లో రెనాల్ట్ ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షల నుండి రూ. 8.98 లక్షల మధ్య ఉంటుంది.
రెనాల్ట్ కిగర్: Renault Kigerపై మొత్తం రూ.75,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దాని తక్కువ-స్పెక్ RXE, RXL వేరియంట్లు మినహా, అన్ని వేరియంట్లు రూ. 40,000 వరకు తగ్గింపును పొందుతున్నాయి. వీటిపై లాయల్టీ బోనస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
కిగర్పై రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 వరకు లాయల్టీ బోనస్ ఇస్తోంది. ఇండియన్ మార్కెట్లో రెనాల్ట్ కిగర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6 లక్షల నుండి రూ.11.23 లక్షల వరకు ఉంది.