Canara Bank Recruitment: బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కెనరా శుభవార్త వినిపించింది. బ్యాంకు తాజాగా స్పెషలిస్టు ఆఫీస్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Canara Bank Recruitment: బ్యాంకులో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కెనరా బ్యాంకు శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాంకులో జాబ్ చేయాలనుకునేవారికి నిజంగా గొప్ప అవకాశం ఇది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు canarabank.com అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
స్పెషల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ ఈ నెల 6వ తేదీన షురూ అయ్యింది. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 24తో ముగియనుంది. దరఖాస్తు కు మరో 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
డేటా అనలిస్ట్, డేటా మైనింగ్ ఎక్స్పర్ట్, డేటా సైంటిస్ట్, అప్లికేషన్ డెవలపర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్, ఐటి సిస్టం, అడ్మినిస్ట్రేటర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఐటిలో గ్రాడ్యుయేట్ BE / B.Tech కలిగి ఉండాలి. గతంలో పనిచేసిన అనుభవం కూడా ఉండాలి.
అర్హతలకు సంబంధించి మరింత సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో పొందుపరిచారు. అయితే దరఖాస్తుదారులు గరిష్ట వయోపరిమితి డిసెంబర్ 1, 2024 నాటికి 35 ఏళ్లుగా నిర్ణయించింది. రిజర్వ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంది. స్పెషల్ ఆఫీసర్ పోస్టుల నియామకంలో రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
రాత పరీక్షలు ప్రొఫెషనల్ నాలెడ్జ్ తో పాటు లోకల్ రీజనింగ్ పై 100 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది. నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఒక్క తప్పుకు 0.5 నెగటివ్ మార్కు ఉంటుంది.
దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కెనరా బ్యాంక్ తెలిపింది. రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని బ్యాంక్ వెల్లడించింది.
స్పెషల్ ఆఫీసర్గా ఎంపికైన వారికి ఏడాదికి 18 లక్షల నుంచి 27 లక్షల వరకు జీతభత్యం ఉంటుందని వెల్లడించింది. అంటే నెలకు 1.25లక్షల నుంచి 2.25 లక్షల వరకు జీతం వస్తుంది. అభ్యర్థి అర్హత అనుభవం ప్రస్తుత ప్యాకేజీ పై ఈ వేతనంపై ఆధారపడి ఉంటుంది. నియామక ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం కెనరా బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో సంప్రదించవచ్చని కోరింది.