Realme 14 Pro Plus Price: భారత మార్కెట్లోకి రియల్ మీ అద్భుతమైన మొబైల్ ను విడుదల చేసింది. ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీ తో పాటు ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయింది. అలాగే అత్యద్భుతమైన డిజైన్ కలిగి ఉంది. ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇపుడే తెలుసుకోండి.
Realme 14 Pro Plus Price: భారత్ మార్కెట్లోకి కొత్త రియల్ మీ మొబైల్ లాంచ్ అయింది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్ తో పాటు అద్భుతమైన డిజైన్ను కలిగి ఉంది. దీనిని కంపెనీ Realme 14 Pro+ పేరుతో విడుదల చేసింది. ఇది ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్ ను కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్ మోస్ట్ పవర్ఫుల్ 6000mAh బ్యాటరీతో విడుదల కాబోతోంది. అలాగే ఇది ఫ్రంట్ సెటప్ లో కూడా అద్భుతమైన డిజైన్తో పాటు ప్రీమియం కెమెరా సెట్ అప్ తో విడుదలైంది. అయితే ఈ మొబైల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.
ఈ Realme 14 Pro+ స్మార్ట్ ఫోన్ 6.83-అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే తో విడుదల అయినట్లు తెలిపింది. అలాగే ఈ మొబైల్ అద్భుతమైన డిజైన్లు కలిగి ఉంటుంది. దీంతోపాటు ప్రీమియం లుక్ లో కనిపించేందుకు ఆకర్షణీయమైన కలర్ సెట్ అప్ తో విడుదల అయింది.
Realme 14 Pro+ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర, ఇతర వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ మొత్తం మూడు స్టోరేజ్ ఆప్షన్స్ లో విడుదలైంది. ఇందులోని బేస్ బేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరీస్ తో రూ.29,999 ధరతో లభిస్తోంది. ఇక హై ఎండ్ వేరియెంట్ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. దీని ధర రూ.34,999కే లభిస్తోంది
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన విక్రయాలను జనవరి 23వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. అయితే మొదటి సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Realme 14 Pro+ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ ను కంపెనీ Android 15 ఆధారిత Realme UI 6.0 తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా ఇది ప్రత్యేకమైన Adreno 720 GPUతో 2.5GHz ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 4nm పై పనిచేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇక ఈ మొబైల్ కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 6000mAh బ్యాటరీతో పాటు 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఫీచర్స్ తో విడుదల అయింది. అంతేకాకుండా దీని డిస్ప్లే 2800 x 1272 పిక్సెల్‌ల రిజల్యూషన్ ను కలిగి ఉండబోతోంది.