Maha Kumbh mela: మహకుంభమేళలో గ్లామరస్ సాధ్వీ వివాదం సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది. దీనిపై హర్ష రిచారియా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ప్రయాగ్ రాజ్ కుంభమేళ వేడుకగా ప్రారంభమైంది. కోట్లాది మంది భక్తులు పవిత్రమైన పుణ్య స్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు. దాదాపు.. 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళ కావడంతో భక్తులు భారీగా వస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పవిత్రమైన గంగానదిలో స్నానం చేశారు.
13 అఖాడాలకు చెందిన సాధులు, సంత్ లు.. పుణ్యస్నానాలు చేసేందుకు ప్రయాగ్ రాజ్ కు తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుంభమేళలో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కల్గకుండా.. యోగీ సర్కారు అనేక చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. కుంభమేళలో ఇటీవల కొంత మంది సాధులువులు, అఘోరీలు వార్తలలో ఉంటున్నారు.
ముఖ్యంగా స్టీవ్ జాబ్స్ సతీమణి, ఐఐటీ బాబా, గ్లామరస్ సాధ్వీ హర్ష రిచారియా ఎక్కువగా ట్రెండింగ్ గా మారారు. గ్లామరస్ సాధ్వీ కుంభమేళలో ఇటీవల హల్ చల్ చేశారు. అయితే.. ఆమె కేవలం పబ్లిసిటీ కోసం.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు వచ్చారని అనేక మంది ఆమెను విమర్శించారు. ఇటీవల ఆమె కుంభమేళలో.. రథం ఎక్కి పర్యటించడం కూడా వివాదంగా మారింది. ఆమెపై ఆనంద్ స్వరూప్ జీ మాత్రం ఫైర్ అయ్యారు.
సాధ్వీ అనిచెప్పుకుంటూ.. ఇలాంటి పనులు చేయడం ఏంటని మండిపడ్డారు. ఇలాంటి వాటికి కుంభమేళలో స్థానం లేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా..ఈ వివాదం తీవ్ర దుమారంగా మారింది. అయితే.. దీనిపై తాజాగా.. గ్లామరస్ సాధ్వీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను కుంభమేళకు వచ్చింది.. ప్రజల్ని ప్రభావితం చెద్దామని అనుకున్నట్లుచెప్పారు.
హిందు ధర్మం కోసం తాను పనులు చేస్తుంటే.. తన మీద లేని పోనీ అభాండాలు వేస్తున్నారని అన్నారు. కుంభమేళకు వచ్చి నేను చేసిన తప్పేంటని మండిపడ్డారు. అంతే కాకుండా.. నాన్ వెజ్ తిన్నానా.. మద్యంతాగానా.. అన్ని ప్రశ్నించారు. గతంలో నేను వేసుకున్న డ్రెస్ ల మీద కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని.. దానిలో తప్పేంటని అన్నారు.
ఇప్పుడు అవన్నింటికి దూరంగా ఉండి.. సాధ్వీ జీవనంలో ఉన్నానని.. ఎందుకు తనను టార్గెట్ చేశారని గ్లామరస్ సాధ్వీ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై వివాదస్పద ఆరోపణలు చేస్తున్న ఆనంద్ స్వరూప్ జీ మహా రాజ్ కు భార్య ఉందని.. ఆయన ఇవన్ని దాచి పెట్టాడని.. ఆయన బాగోతం అంతా తనకు తెలుసని హర్షరిచారియా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో కుంభమేళలో.. తన వల్ల ఎవరికి నష్టం కలిగిందని అన్నారు. ఈరోజు ఏదో తప్పులు చేసిన దానిలా.. ఇలా హోటల్ లో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్లామరస్ సాధ్వీ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.