Ratan Tata: భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌.. మూడేళ్ల కిందే రతన్‌ టాటా ఏమన్నారో తెలుసా?

Bharat Ratna To Ratan Tata: అనారోగ్య సమస్యలతో ఓ లెజండరీ దివికేగారు. ఇప్పటికీ చెప్పడానికీ ఈ విషయం నమ్మశక్యం కానప్పటికీ ఇది నిజం.. టాటా వస్తువులకు ఎంతో ప్రాధాన్యత సంతరించు కోవడం, భారత్‌కు అంతర్జాతీయ మార్కెట్లో తనదైన ముద్ర లభించడంలో టాటా కీలకం. ఆయన చేసిన సేవలకు, ఉదారతకు భారతరత్న ఇవ్వాలని మూడేళ్ల కిందటే డిమాండ్‌ చేశారు.
 

1 /5

Bharat Ratna To Ratan Tata: అనారోగ్య సమస్యలతో పోరాడి బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన రతన్‌ టాటా. ఈయన 2008 లోనే పద్మవిభూషణ్‌ అందుకున్నారు. ఆ తర్వాత టాటాకు భారతరత్న కూడా ఇవ్వాలనే డిమాండ్‌ మూడేళ్ల క్రితమే చాలా మంది ప్రస్తావించారు.  

2 /5

దీని గురించి పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో సైతం ప్రముఖులు కూడా డిమాండ్‌ చేశారు. దీనిపై హ్యాష్‌ ట్యాగ్ కూడా క్రియేట్‌ చేసి పెద్ద యుద్ధమే చేశారు. కానీ, ఇలా సోషల్‌ మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని ఓ పోస్టులో రతన్‌ టాటా అందరికీ విజ్ఞప్తి కూడా చేశారు.  

3 /5

దేశ అభివృద్ధిలో తన వంతు కృషి చేసినందుకు ఆనందంగా ఉందని, భారతీయుడిగా పుట్టడమే తన అదృష్టమని అప్పుడు తన వ్యాఖ్యల్లో ఈ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.  

4 /5

రతన్‌ టాటా యువతకు ఎంతో నిదర్శనం. దేశానికి టాటా అందిస్తున్న సేవలకు ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనని 'భారతరత్న ఫర్ రతన్‌ టాటా' హ్యాష్‌ ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే.  

5 /5

యువత ఏదైనా సాధించాలంటే ముందుగా వారి శక్తి సామార్థ్యాలపై వారికి నమ్మకం ఉండాలని ఓ నెటిజెన్‌ ట్వీట్‌కు సైతం అప్పట్లో రతన్‌ టాటా బదులిచ్చారు. మరీ ఇప్పుడైనా రతన్‌ టాటాకు భారత్న రత్న ప్రకటిస్తారో లేదో తెలియాల్సి ఉంది.