Rasha Thadani Loves 40 Years Old Bollywood Star Hero: బాలీవుడ్ పరిశ్రమ అంటే అదో పేద్ద సముద్రం. ఆ సముద్రంలో ఇప్పుడే అడుగుపెట్టిన ఓ కుర్ర హీరోయిన్ అప్పుడే 40 ఏళ్ల హీరోతో ప్రేమాయణం నడిపిస్తోందనే వార్త బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అతడితో డేటింగ్‌కు కూడా సిద్ధమని ప్రకటించడంతో హాట్ టాపిక్ అయ్యింది. ఎవరు ఆ హీరోయిన్? ఆ హీరో ఎవరో తెలుసుకోండి.
ప్రస్తుతం బాలీవుడ్‌లో టీనేజీ హీరోయిన్ ట్రెండింగ్‌లో ఉంది. తన సినిమాతో యావత్ బాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తోంది. నవ యవ్వన అందాలతో ప్రేక్షకులను రంజింపచేస్తోంది.
ఆ టీనేజీ హీరోయిన్ అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో లేదో అప్పుడే ఆ స్టార్ హీరోపై కన్నేసింది. అతడిపై తనకు ప్రేమ ఉందని.. డేటింగ్‌కు కూడా సై అని చెప్పడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
40 ఇయర్స్ హీరోతో ప్రేమాయణానికి సిద్ధమైన హీరోయిన్ ఎవరో కాదు రషా తడానీ. 19 ఏళ్ల రషా అలనాటి నటి రవీనా టాండన్ కుమార్తె. తల్లి నట వారసత్వాన్ని రషా తీసుకుని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
అభిషేక్ కపూర్ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్‌తో కలిసి రషా 'ఆజాద్' సినిమా చేసింది. ఆ సినిమా బాలీవుడ్‌లో హిట్ సొంతం చేసుకోవడంతో రషాపై ప్రేక్షకులు దృష్టి సారించారు.
ఆజాద్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న రషా తడానీ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే పరిశ్రమలో ఎవరిపై క్రష్ ఉందో చెప్పేసింది.
'నా మొదటి పరిశ్రమకు చెందిన క్రష్ సిద్ధార్థ్ మల్హోత్రా' అని రషా తడానీ చెప్పి ఆశ్చర్యపరిచింది. 'సిద్ధార్థ్ మల్హొత్రా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా అంటే చాలా ఇష్టం' అని చెప్పింది.