Turmeric Milk: ఆయుర్వేదం ప్రకారం ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. అందులో ముఖ్యమైంది పసుపు. పసుపు పాలు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగిందని భావిస్తారు. కచ్చితంగా ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అయితే కొంతమంది మాత్రం పసుపు పాలకు దూరంగా ఉండాల్సిందే. లేకపోతే ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
పిత్త దోషం పసుపు స్వభావం వేడి చేసేది కావడంతో పిత్త దోషం ఉన్నవాళ్లు పసుపు పాలు తాగకూడదు. ఎందుకంటే పసుపు పాలు తాగితే పిత్త దోషం సమస్య మరింత పెరగవచ్చు. ఫలితంగా శరీరంలో వేడి పెరుగుతుంది. కడుపులో మంట వంటి సమస్య రావచ్చు
విరేచనాలు-వాంతులు పసుపు పాలు తాగడం వల్ల కొందరికి విరేచనాల సమస్య ఎదురు కావచ్చు. ముందు నుంచే కడుపు సమస్య లేదా విరేచనాలు ఉంటే పసుపు పాలు తాగకూడదు. ఇక వికారం లేదా వాంతుల సమస్య ఉన్నప్పుడు కూడా పసుపు పాలు తాగకూడదు. ఇలాంటి వారికి ఎసిడిటీ సమస్య ఉత్పన్నం కావచ్చు
కడుపు నొప్పి కడుపులో నొప్పి ఉన్నప్పుడు కూడా పసుపు పాలు తాగకూడదు. పసుపు పాలు తాగడం వల్ల కడుపు నొప్పి సమస్య పెరుగుతుంది. పసుపులో ఉండే కర్‌క్యూమిన్ కడుపు నొప్పిని మరింతగా పెంచుతుంది
స్కిన్ ఎలర్జీ స్కిన్ ఎలర్జీ సమస్యతో బాధపడేవాళ్లు పసుపు పాలకు దూరంగా ఉండాలి. లేకపోతే స్కిన్ ఎలర్జీ మరింతగా పెరుగుతుంది.