Ram charan: 13 ఏళ్ల కెరీర్..నో చెప్పిన ఆ ఐదు సినిమాలివే

Ram charan: మెగాస్టార్ నట వారసుడిగా చిరుత సినిమాతో 2007లో సినీ పరిశ్రమలో ప్రవేశించిన రామ్ చరణ్ కెరీర్ కు 13 ఏళ్లు గడిచాయి.  ఈ 13 ఏళ్ల కెరీర్ లో రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలు కూడా ఉన్నాయి.

  • Dec 01, 2020, 22:16 PM IST

 

Ram charan: మెగాస్టార్ నట వారసుడిగా చిరుత సినిమాతో 2007లో సినీ పరిశ్రమలో ప్రవేశించిన రామ్ చరణ్ కెరీర్ కు 13 ఏళ్లు గడిచాయి.  ఈ 13 ఏళ్ల కెరీర్ లో రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే రామ్ చరణ్ నిర్ణయం సరైందే మరి. చెర్రీ నిరాకరించిన ఆ ఐదు సినిమాల్లో కొన్ని విజయం సాధించగా..కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇంతకీ ఆ ఐదు సినిమాలేంటో చూద్దామా..

1 /7

దర్శకుడు గౌతమ్, మణిరత్నం ల ఆఫర్ లను కూడా చెర్రీ తిరస్కరించాడు. అయితే వేరే ఇతర కారణాలతోనే నిరాకరించినట్టు స్వయంగా చెర్రీ చెప్పాడు.

2 /7

దర్శకుడు పూరీ జగన్నాథ్ తీసిన చిరుత సినిమా అప్పట్లో 20 కోట్లు వసూలు చేసి నిర్మాతకు లాభాలు అందించింది. సెలెక్షన్ ఆఫ్ సినిమాల్లో చెర్రీ చూపిస్తున్న ప్రావీణ్యతే అతనికి విజయాలందిస్తోంది.

3 /7

దర్శకుడు గౌతమ్...సూర్య సన్నాఫ్ కృష్ణన్ కధను ముందు రామ్ చరణ్ కు విన్పించాడు. అయితే చిరుత విడుదలై అప్పటికి ఏడాదే కావడంతో సాఫ్ట్ సినిమా వద్దనుకున్నాడు. నిరాకరించాడు. సూర్య హీరోగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

4 /7

దర్శకుడు గౌతమ్ ఎటో వెళ్లిపోయింది మనసు కధను ముందు చెర్రీకే విన్పించాడు. ఆరెంజ్ డిజాస్టర్ ఫెయిల్ కావడంతో లవ్ స్టోరీలు వద్దనుకుని కాదని చెప్పాడు చెర్రీ. ఇక ఆ సినిమా నానీ హీరోగా విడుదలైంది. 

5 /7

గీతాంజలి లాంటి క్లాసిక్ సినిమా తరువాత టాప్ డైరెక్టర్ మణిరత్నం రామ్ చరణ్ కోసం ఓకే బంగారం కధ విన్పించాడు. ఆ సమయంలో బ్రూస్లీ సినిమాతో బిజిగా ఉన్న కారణంగా చెర్రీ నిరాకరించాడు. ఆ తరువాత దుల్కర్ సల్మాన్ హీరోగా విడుదలైంది.

6 /7

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వరుస విజయాల్ని అందించిన మేర్లపాక గాంధీ..కృష్ణార్జున యుద్ధం కధతో రామ్ చరణ్ దగ్గరకు వెళ్లాడు. అయితే ద్విపాత్రాభినయం, రొటీన్ కధ కావడంతో నిరాకరించాడు చెర్రీ. తరువాత ఇదే సినిమా నానీ హీరోగా విడుదలైంది.

7 /7

సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం విజయాలతో నేల టిక్కెట్టు కధతో రామ్ చరణ్ దగ్గరకు వెళ్లాడు దర్శకుడు కృష్ణ కురసాల. కధ నచ్చకపోవడంతో చెర్రీ నో చెప్పాడు. అనంతరం ఈ సినిమా రవితేజ హీరోగా విడుదలైంది.