Raashii Khanna: హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోయిన రాశీ ఖన్నా.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Raashii Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఇంతింతై అన్నట్టు కథానాయికగా దూసుకుపోతుంది. అటు కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో తనదైన శైలిలో రాణిస్తోంది. అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఒద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ స్లిమ్‌గా సన్నజాజి తీగలా మారిపోయింది. 

1 /5

రాశీ ఖన్నా.. తెలుగులో తనదైన శైలిలో దూసుకుపోతుంది. కేవలం సినిమాలు మాత్రమ కాదు.. వెబ్ సిరీస్‌లో కూడా అలరించింది. అజయ్ దేవ్‌గణ్ 'రుద్ర'తో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిన 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది. 

2 /5

రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఊహాలు గుసగుసలాడే మూవీతో పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత గోపీచంద్‌తో చేసిన 'జిల్' మూవీతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది. 

3 /5

తెలుగులో ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' తప్పించి మిగతా టాలీవుడ్ బడా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఈ అమ్మడికి ఛాన్సులు దక్కలేదు. 

4 /5

జిల్ తర్వాత గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' సినిమాలో నటించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. 

5 /5

ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య సరసన నటించిన 'థాంక్యూ' మూవీ రాశీ ఖన్నా ఆశలపై నీళ్లు చల్లింది. అందుకే తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమిళం, హిందీలపై ఫోకస్ పెడుతోంది.