Prabhas Photos at Mogaltur: మొగల్తూరులో జనసందోహం.. కృష్ణంరాజు సంతాప సభ కోసం కదలివచ్చిన అభిమానులు-ఫోటోలు వైరల్

Prabhas Photos at Mogaltur: కృష్ణంరాజు సంతాప సభ మొగల్తూరులో ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి జన సందోహం వెల్లువెత్తింది. ఆ ఫోటోలు ఇప్పుడు చూద్దాం. 

  • Sep 29, 2022, 17:56 PM IST
1 /5

ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఊరికి రావడంతో స్థానిక ప్రజలు ఆత్మీయంగా వారికి స్వాగతం పలికారు. ఇక కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు రోజా, చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పరామర్శించారు

2 /5

రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం కృష్ణంరాజు స్వస్థలమైన  మొగల్తూరులో భారీ ఎత్తున జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొగల్తూరు నివాసానికి వెళ్లారు. 

3 /5

ఈ క్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ రాజకీయాల్లో, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఘనత కృష్ణం రాజు కే దక్కుతుందని అన్నారు. కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లాడరని, కృష్ణం రాజు మృతి కుటుంబానికి తీరని లోటని అన్నారు. 

4 /5

. కృష్ణం రాజు - వైఎస్ఆర్ కి మంచి అనుబంధం ఉందని, భౌతికంగా ఆయన దూరమైనా ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ది ఎవ్వరూ మరువలేరని రోజా అన్నారు. 

5 /5

కృష్ణం రాజు సినిమాల్లో రెబల్ స్టార్, రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ అని పేర్కొన్న ఆమె కృష్ణం రాజు ఆశయాలకు తగ్గట్టు ప్రభాస్ సినీ రంగంలో మరింత పేరు తెచ్చుకోవాలన్నారు.