Allu Arjun at Golden Temple: అమృతసర్లో అల్లు అర్జున్ భార్య 'స్నేహారెడ్డి' పుట్టిన రోజు వేడుకలు..ఫోటోలు వైరల్

Allu Arjun at Golden Temple:  సెప్టెంబర్ 29వ తేదీ స్నేహ రెడ్డి పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ భార్య పిల్లలతో కలిసి అమృత్ సర్ స్వర్ణ దేవాలయానికి వెళ్లారు. ఆ వివరాలు 

  • Sep 29, 2022, 17:26 PM IST
1 /5

2 /5

అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 29వ తేదీ స్నేహ రెడ్డి పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.

3 /5

 భార్యతో కలిసి ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసిన ఆయన క్యూటీ అని దానికి కామెంట్ పెట్టారు. స్నేహారెడ్డి పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేస్తున్న ఫోటోలు అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఇక తన భార్య స్నేహారెడ్డి తో కలిసి అల్లు అర్జున్ పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయం లో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. 

4 /5

దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ అభిమానులు,  మెగా అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

5 /5

అల్లు స్నేహారెడ్డి సినిమాలతో ఎలాంటి సంబంధం లేకుండా సపరేట్ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అల్లు అర్జున్ కి సంబంధించిన అనేక ఫోటోలను అలాగే తమ పిల్లలు అర్హ అయాన్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. దీంతో అభిమానులు కూడా ఆమె ఎప్పుడు ఫోటోలు షేర్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో అల్లు స్నేహారెడ్డి,  పలు హాట్ ఫోటోలు షేర్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది.