Pavitra Lokesh: అత్యంత ధనిక నటుడిని మూడో పెళ్లి చేసుకున్న 'సినిమా ఆంటీ'

Pavitra Lokesh Marries Third Time: సినీ పరిశ్రమలో ఈ ఏడాది మరపురాని సంఘటన ఏది అయినా జరిగింది అంటే నటీనటుల మూడో పెళ్లి. సినీ పరిశ్రమలో కలిసి పని చేసిన వారిద్దరూ మూడోసారి పెళ్లి చేసుకున్నారనే వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. సినిమాల్లో ఆంటీగా కనిపించే పవిత్ర లోకేశ్ సినీ నటుడు వీకే నరేశ్‌ను వివాహం చేసుకున్నారనే వార్తలు ఉన్నాయి. అయితే అతడి ఆస్తులు షాకింగ్‌గా ఉన్నాయి.

1 /8

కన్నడ సినీ పరిశ్రమలో సినిమాలు, సీరియల్స్‌ చేస్తూ పవిత్ర లోకేశ్‌ ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు.

2 /8

కన్నడ నుంచి తెలుగు పరిశ్రమలోనూ మెరిసి అనంతరం బిజీ ఉన్న ఆర్టిస్ట్‌గా మారిపోయారు.

3 /8

పవిత్ర కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించారు. ఆమె ప్రముఖ రంగస్థల, చలనచిత్ర నటుడైన మైసూర్ లోకేశ్‌ కుమార్తె. 16 ఏళ్ల వయసులో ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.

4 /8

కన్నడలో 150కి పైగా చిత్రాల్లో నటించిన పవిత్ర లోకేష్ వయసు ఇప్పుడు 45 ఏళ్లు. అయితే ఆమె వైవాహిక జీవితం సవ్యంగా లేదు.

5 /8

పవిత్ర లోకేష్ మొదటి భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని.. కుటుంబసమస్యల కారణంగా విడాకులు అయినట్లు సమాచారం. 

6 /8

ఇక ఆమె రెండో భర్త సుచీంద్ర ప్రసాద్. ఆయన కన్నడ నటుడు కూడా. 2018 నుంచి సుచీంద్ర ప్రసాద్‌తో పవిత్ర లోకేశ్‌ విడిపోయినట్లు తెలుస్తోంది.

7 /8

తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన తర్వాత పవిత్రా లోకేశ్‌కు సినీ నటుడు వీకే నరేశ్‌ పరిచయమయ్యాడు. నరేశ్‌కు కూడా గతంలో రెండు వివాహాలయ్యాయి. 

8 /8

తామిద్దరి జీవితాలు ఒకేలా ఉండడంతో అభిప్రాయాలు కలిశాయని.. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉంటున్నారని సమాచారం. ఇప్పటికే పవిత్ర నరేశ్‌ మూడో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. అయితే నరేశ్‌కు రూ.6 వేల కోట్ల ఆస్తి ఉండడం గమనార్హం.