OTP Scams: ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఓటీపీ స్కామ్స్‌కు తెరతీశారు. మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ పంపించి మోసంతో ఆ ఓటీపీ తెలుసుకుని ఆన్లైన్లో మీ డబ్బులు కాజేస్తుంటారు. అయితే కొన్ని పద్థతుల ద్వారా ఓటీపీ స్కామ్స్ నుంచి కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
అందుకే పొరపాటున కూడా ఎవరికీ ఓటీపీ షేర్ చేయవద్దు. ఒకవేళ ఓటీపీ స్కామ్ జరిగిందని అన్పిస్తే బ్యాంక్‌ను సంప్రదించండి. లేదా బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి
మోసం చేసేవాళ్లు ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ ఎంటర్ చేయమంటారు. మీరు గుర్తుంచుకోవల్సింది ఏంటంటే బ్యాంక్ లేదా సంస్థ ఎప్పుడూ ఓటీపీ అడగదు. ఒకవేళ మీకు మెస్సేజ్ వస్తే ఆ నెంబర్ వెంటనే బ్లాక్ చేయండి
నేరాలు, మోసాలు చేసేందుకు తెలియని నెంబర్ నుంచి బ్యాంక్ సిబ్బంది అని చెప్పుకుని ఫోన్ చేస్తారు. ఓటీపీ అడుగుతారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేయండి
ఆన్లైన్ మోసగాళ్లు మీకొక ఫేక్ మెయిల్ పంపిస్తారు. అది బ్యాంక్ నుంచి వచ్చిందనుకుంటారు. ఈ మెయిల్లో ఓటీపీ ఎంటర్ చేయమని సూచిస్తారు. ఇందులో గ్రామర్ మిస్టేక్స్ ఉండవచ్చు. అలాంటివి కన్పిస్తే జాగ్రత్త పడండి
ఓటీపీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరికి షేర్ చేయకూడదు. బ్యాంక్ ఉద్యోగి అనో లేదా ప్రభుత్వ అధికారి అనో మీకు ఫోన్ చేసి చేసి ఓటీపీ అడగవచ్చు. అలాంటప్పుడు అప్రమత్తంగా ఉండండి.