One Husband Two Wife: భారత్ విభిన్న సంస్కృతుల సమ్మేళనం.. అందుకే మన దేశంలో ఏ ఇతర దేశాల ప్రజలైనా సులభంగా జీవిస్తారు. అయితే కొన్ని దేశాల్లో పెళ్లికి సంబంధించిన వింత ఆచారాలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని ఓ గ్రామంలో వింత సంప్రదాయానికి సంబంధించిన ఓ ఆచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
జైసల్మేర్ జిల్లాలోని ఓ గ్రామంలో గత కొన్ని ఏళ్ల నుంచి వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. ఈ గ్రామంలో ఎవరైనా పురుషులు పెళ్లి చేసుకుంటే తప్పకుండా ఇద్దరు అమ్మాయిలను చేసుకునే హక్కు ఉంది. అంతేకాకుండా మొదటి పెళ్లి జరిగిన తర్వాత రెండు పెళ్లికి ఫస్ట్ భార్య కూడా ఒప్పుకుంటుందట.
ఇలా ఒకే అబ్బాయి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ఆనవాయిగా చాలా కాలం నుంచి వస్తోందని పూర్వీలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వింత సాంప్రదాయం నెట్టింట చక్కెర్లు కొడుతోంది.
రామదేవర బస్తీ గ్రామంలో ఇప్పటికీ ప్రతి యువకుడికి ఇద్దరు భార్యలు ఉన్నారని సమాచారం. ఇక్కడి ప్రజలు ఈ సంప్రదాన్ని ఎంతో గర్వంగా పాటిస్తూ ఉంటారని తెలుస్తోంది. అలాగే ఇద్దరినీ పెళ్లి చేసుకున్న వారు ఎంతో హ్యాపీగా ఉంటారట.
రామదేవర బస్తీ గ్రామంలో మరో ట్విస్ట్ ఉంది.. ఇలా ఇద్దరిని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరి మొదటి భార్య ఆడపిల్లకే జన్మిస్తుందట. దీని కారణంగా అక్కడి పురుషులు రెండవ పెళ్లి చేసుకుంటున్నారని సమాచారం.
ప్రస్తుతం చదువుకున్న యువత మాత్రం ఈ సంప్రదాయానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటున్నారు. అంతేకాకుండా కేవలం ఒక పెళ్లి మాత్రమే చేసుకుంటున్నారని సమాచారం..
అలాగే ఆ ప్రాంతాల్లో పురుషుల సంఖ్య పూర్తిగా తగ్గడం, సమాజ సమతుల్యత కోసం ఈ వింత సంప్రదాయాన్ని ఆచరిస్తూ వస్తున్నారని మరి కొంతమంది పెద్దలు తెలుపుతున్నారు.