Neha Shetty: హాట్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన నేహా శెట్టి.. ఫోటోస్ వైరల్..

 
Neha Shetty | నేహా శెట్టి గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో  వినిపిస్తోన్న పేరు. ఈమె డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ మధ్య ‘బెదురులంక’ సినిమాతో పలకరించింది. తాజాగా టిల్లు స్వ్కేర్ మూవీలో కాసేపు అలా మెరిసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ రాబోయే సినిమాలపై ఫుల్ హోప్స్ పెట్టుకుంది.

1 /5

కన్నడ భామ అయిన నేహా శెట్టి.. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో పరిచయమైంది. తన సొంత భాష కన్నడలో విడుదలైన 'ముంగారు మేల్ 2' మూవీతో  సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.

2 /5

ఆ తర్వాత 'గల్లీ రౌడీ' సినిమాతో పలకరించింది నేహా. అటు అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్నపాత్రలో నటించింది.

3 /5

ఇక సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది. తాజాగా మరోసారి 'టిల్లు స్క్వేర్' మూవీతో ప్రేక్షకులను కాసేపు అలా మెరిసింది.

4 /5

డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

5 /5

ప్రెజెంట్ నేహా శెట్టి ఈమె విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో నటిస్తోంది. ఈ సినిమాపై ఈ అమ్మడు మంచి హోప్స్ పెట్టుకుంది.