Kajal Aggarwal: పెళ్లైన గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గని కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలైన ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది. కథానాయిక లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే మాములు విషయం కాదు. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. ఈ టాలీవుడ్ మిత్రవింద ఇపుడు వరుస సినిమాలతో కుమ్మేస్తోంది.

1 /6

తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.

2 /6

తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్ అగర్వాల్.

3 /6

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర'తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్.

4 /6

పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది కాజల్ అగర్వాల్.

5 /6

పెళ్లికి ముందు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్.. ఇపుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.

6 /6

లాస్ట్ ఇయర్ 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది. తొలిసారి ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా మెప్పించింది కాజల్ అగర్వాల్ .