NBK Daaku Maharaaj Collections to akhanda Collections: నందమూరి బాలకృష్ణ తన మూవీస్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉన్నారు. సినిమాల సెలెక్షన్స్ విషయంలో ఆయన ఆలోచనే మారిపోయింది. అంతేకాదు సినిమాకు సినిమాకు తన బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నారు. తాజాగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అత్యధికంతా జరిగింది. ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత సాధించింది. గత నాలుగు చిత్రాల వారం రోజుల కలెక్షన్స్ తో పాటు లైఫ్ టైమ్ కలెక్షన్స్ విషయానికొస్తే..
అఖండ నుంచి నందమూరి బాలకృష్ణ సెకండ్ ఇన్సింగ్స్ షురూ అయింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంతో ఆడియన్స్ కొత్త బాలయ్యను చూస్తున్నారు. అఖండ నుంచి డాకు మహారాజ్ అపజయం అంటూ లేకుండా తన జైత్రయాత్ర కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ నుంచి అఖండ వరకు సాధించిన సినిమాల వసూళ్ల విషయానికొస్తే..
డాకు మహారాజ్.. బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 82 కోట్ల టార్గెట్ తో బరిలో దిగింది. వారం రోజుల్లో రూ. 73 కోట్ల షేర్ వసూళు చేసింది. తాజాగా రూ. 83 కోట్ల టార్గెట్ షేర్ రాబట్టి బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.
భగవంత్ కేసరి.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణ తన ఏజ్ కు తగ్గ పాత్రలో నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా మొదటి వారంలో రూ. 56 కోట్ల షేర్ రాబట్టింది. టోటల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ. 72 కోట్ల షేర్ రాబట్టింది.
వీరసింహారెడ్డి .. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్ట్ చేసిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారంలో రూ. 72 కోట్ల షేర్ రాబట్టింది. ఇక టోటల్ రన్ లో ఈ సినిమా రూ. 79.82 కోట్ల షేర్ రాబట్టి అప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.
అఖండ.. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. బాలయ్య ఈ సినిమాలో రైతుగా.. అఘోరాగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా అప్పట్లో మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 45.11 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 53.49 కోట్ల షేర్ రాబట్టింది.
మొత్తంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలన్నింటిని కలిపి రూ. 306 కోట్ల షేర్ (రూ. 600 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టాయి. మొత్తంగా మూడేళ్ల గ్యాప్ లో బాలయ్య నాలుగు సినిమాలతో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం విశేషం.