Mouth Ulcers: మనలో చాలా మంది నోటిలో పుండ్లతో తెగ బాధపడుతుంటారు. కనీసం మాట్లాడలేక తీవ్ర ఇబ్బందులు పడుతారు. కొందరికి ఎండకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
కొందరు ప్రతిదానికి ఎంతో టెన్షన్ పడుతుంటారు. వీరు ప్రాపర్ గా ఫుడ్ కూడా తీసుకొరు. అందుకే ఇలాంటి వారిలో ఎక్కువగా మౌత్ అల్సర్ సమస్య కన్పిస్తుంది. నోరంతా తెల్లగా పూత వచ్చినట్లు వెచ్చి ఉంటుంది.
నోటి పూత వల్ల సరిగ్గా మాట్లాడటానికి కూడా ఇబ్బందులు పడతారు. కొందరిలో విటమిన్స్ లోపం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. నోటి పూత వచ్చే ముందు వీరి శరీరంలో అనేక మార్పులుసంభవిస్తాయి.
కొందరిలో మూత్రం పసుపుపచ్చగా రావడం జరుగుతుంది. ఆ తర్వాత శరీరంలో తీవ్రమైన ఒక అనీజీ గా అన్పిస్తుంది. దీంతో ఏపనికూడా చేయాలన్నిపించక చికాకుగా ఉంటారు. ప్రతి దానికి కోపం తెచ్చుకుంటారు.
మౌత్ అల్సర్ వస్తే.. మొదట నెయ్యిని, తేనెను మిక్స్ చేసుకొవాలి. ఈ రెండింటిని చక్కగా మిక్స్ చేసి నోటి పూత ఏర్పడిన భాగానికి పెట్టాలి. అంతేకాకుండా.. వేడి పదార్థాలను తినడం మానేయాలి.
ఇంట్లో తులసీ నీళ్లను రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తాగుతుండాలి. అంతేకాకుండా..రాత్రి పూట తాగే నీటిలో తులసీఆకులను వేసుకొవాలి. తెల్లవారు జామున తాగితే మంచి ఫలితం ఉంటుంది.
పసుపు నీళ్లను కూడా తాగిన మంచి రిజల్ట్ ఉంటుంది. నోటిలో పూత వచ్చిన ప్రదేశంలో పాలమీగడను కూడా అద్దితే మంచి రిజల్ట్ ఉంటుంది. అలోవెరాను తీసి, దాని పెస్టును అల్సర్ ఉన్న చోట పెడితే కొద్దిసేపట్లోనే మంచి ఉపశమనం ఉంటుంది.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)