Narendra modi cabinet allocation: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగగా జరిగింది.
దేశ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఎంతో వేడుకగా జరిగింది. ఆదివారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మోదీ పాటు 71 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇదిలా ఉండగా.. మోదీ ఈరోజు పీఎంవోలో బాధ్యతలు తీసుకున్నారు. తొలిసంతకం కిసాన్ సమ్మాన్ నిధుల కేటాయింపులపై పెట్టారు.
మోదీ కేబినేట్ లో తెలుగు రాష్ట్రాల మంత్రులకు కీలక శాఖలను కేటాయించారు. కేబినేట్ విస్తరణలో మోదీ తన మార్కు చూయించారు. తెలంగాణ బీజేపీ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్రం బొగ్గు, గనుల శాఖను కేటాయించారు. గతంలో కిషన్ రెడ్డి, హోంశాఖ సహయ మంత్రిగా,పర్యాటకం, ఈశాన్యరాష్ట్రాల డెవలప్ మెంట్ శాఖా మంత్రిగాను పనిచేశారు.
బండి సంజయ్.. కు ఈసారి మోదీ హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. కరీంనగర్ నుంచి రెండోసారి గెలిచిన ఆయనకు కేబినేట్ లో అవకాశం దక్కింది. గతంలో తెలంగాణ బీజేపీరాష్ట్ర ప్రెసిడెంట్ గా పనిచేశారు.
ఇక ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు.. పౌరవిమానాయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. గతంలో కూడా.. 2014 లో ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్న టీడీపీకి ఇదేశాఖను కేటాయించారు. అశోక్ గజపతి రాజు ఈ కేబినేట్ మంత్రిగా పనిచేశారు.
ఇక పెమ్మసాని చంద్రశేఖర్ కు.. రూరల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్స్, శాఖలను కేటాయించారు. గుంటూరు నుంచి పెమ్మసాని భారీ మెజార్టీతో గెలుపొందారు.
అదే విధంగా.. బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు.. ఉక్కు, భారీశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను అప్పగించారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు కూడా మోదీ కీలక శాఖలకు కేటాయింపులు చేశారని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమస్యలున్న సావధానంగా చర్చించుకుని కేంద్రం సహాకారంతో, ఇరు రాష్ట్రాలు డెవలప్మెంట్ లో దూసుకొనిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.