Makara Sankranthi 2025: ముంగిలికి ముచ్చటైన అందాలు.. చుక్కలు లేని ఈ చక్కని ముగ్గులు..!

Makara Sankranthi 2025 Muggulu: సంక్రాంతి అంటేనే ముగ్గులు.. సాధారణంగా ఏ పండుగ వచ్చినా ముంగిళ్లు ముగ్గులతో తీర్చిదిద్దుకుంటాం. అయితే, సంక్రాంతి పండుగకు ఎలాంటి ముగ్గులు వేయాలి అని ముందుగానే ప్లానింగ్‌ వేసుకుంటారు. మీ ముంగిలికి అందాన్ని పెంచే చక్కని చుక్కలు కూడా అవసరం లేని ముగ్గులు వేసుకోండి. 
 

1 /10

సంక్రాంతి అంటేనే ఉదయం లేచి స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులతో కోలాహలంగా పండుగ వేడుకలు జరుపుకోవడం. ముంగిట రంగురంగుల ముగ్గులు వేసుకుంటే పండుగకు రెట్టింపు ఆనందం జోడించినట్లవుతుంది.  

2 /10

ఈ పండుగ ప్రత్యేకం ముగ్గులు. రంగురంగుల ముగ్గులతో వాకిట్లు నిండిపోతాయి. ఆ మధ్యలో గొబ్బెమ్మలు మరింత ప్రత్యేకం. పూలు ప్రసాదం పెట్టి పూజలు కూడా చేయడం ఆనవాయితీ.  

3 /10

మీ ముంగిలికి కూడా రంగురంగుల అందమైన ముగ్గులతో నింపాలనుకుంటున్నారా? చిన్నగా చూడటానికి అందంగా కనిపించే ముగ్గులు కూడా వేసుకోవచ్చు.  

4 /10

ఈ కాలంలో పల్లెలు అంటే పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు కానీ, అపార్ట్‌మెంట్‌లలో ఉండేవారికి ఇంటి ముందు చిన్న స్థలం మాత్రమే ఉంటుంది.  

5 /10

అలాంటి ముంగిళ్లకు ఈ ముగ్గులు ఎంతో బాగుంటాయి. చుక్కలు పెట్టకుండానే సులభంగా వేసుకోవచ్చు. ఈ సంక్రాంతి పండుగకు మీ ఇంటికి రెట్టింపు అందాన్ని ఇస్తాయి.  

6 /10

చుక్కల ముగ్గులతో వాకిళ్లు అందంగా ఉంటాయి. కానీ, వాటిని పెద్ద స్థలం ఉండాల్సిందే.  ఇలాంటి పూల ముగ్గులు వేసుకుంటే రంగు వేయడానికి కూడా బాగుంటుంది.  

7 /10

పూల పూల ముగ్గులతో మనకు కావాల్సిన సైజులో ముగ్గులను కుదించివచ్చు.. పెంచవచ్చు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా మీరు ఈ ముగ్గులు వేసుకోవచ్చు. రంగులు లేకుండా కూడా ఈ ముగ్గులు వేసుకోవచ్చు.  

8 /10

ముంగిలికి అందాన్ని పెంచే ఈ ముచ్చటైన ముగ్గులతో ఈ సంక్రాంతికి మీ వాకిళ్లను అలంకరించండి. సరికొత్త డిజైన్స్‌ మీవే అంటారు. భోగి, సంక్రాంతితోపాటు ఇతర ప్రత్యేక రోజుల్లో కూడా ఈ ముగ్గులు వేసుకోండి.  

9 /10

ఇలాంటి ముగ్గులు వేసుకోవడం వల్ల పెద్దగా కష్టం కూడా అనిపించదు. ఎందుకుంటే పూల డిజైన్స్‌లో రంగులు నింపుతూ సులభంగా వేసుకోవచ్చు. ఒక్కరే చాలా తక్కువ సమయంలో ఈ ముగ్గు వేసుకోవచ్చు.  

10 /10

ఈ పూల ముగ్గులు మట్టి వాకిళ్లతోపాటు టైల్స్‌ ఉంటే అపార్ట్‌మెంట్ల ముంగిళ్లకు కూడా బాగుంటాయి. రెట్టింపు అందాన్ని ఇస్తాయి. ఇలా చుక్కలు లేని చక్కని ముగ్గులతో మీ వాకిట్లను నింపండి. పండుగను రెట్టింపు ఆనందంతో ఎంజాయ్‌ చేయండి.