Sunflower Seeds Benefits: పొద్దుతిరుగుడు గింజలు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..!

Benefits of Sunflower Seeds: పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. పొద్దుతిరుగుడు సీడ్స్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 
 

Sunflower Seeds Benefits: ప్రపంచంలోని అందమైన పువ్వులలో పొద్దుతిరుగుడు ఒకటి. ఇది అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పొద్దుతిరుగుడు నూనెను మనం వంటకాల్లో ఉపయోగిస్తాం. అంతేకాకుండా దీని విత్తనాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ సీడ్స్ ప్రయోజనాలేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. 
 

1 /5

పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు, పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అంతేకాకుండా ఈ గింజలు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి.   

2 /5

పొద్దుతిరుగుడు విత్తనాల ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ గింజల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి రక్తనాళాలకు మేలు చేస్తాయి. ఇది హైబీపీని కూడా కంట్రోల్ చేస్తుంది.  

3 /5

పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకోవడం వల్ల మహిళలు రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు. ఇందులో ఉండే లిగ్నన్ అనే పానీఫెనాల్ బాడీలో యాంటీయాక్సిడెంట్ గా పనిచేస్తుంది.   

4 /5

మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, చురుగ్గా ఉండాలన్నా పొద్దుతిరుగుడు విత్తనాలు చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో ఎక్కువగా కాల్షియం మరియు జింక్ వంటి పోషకాలు ఉంటాయి.   

5 /5

పొద్దుతిరుగుడు సీడ్స్ లో ఐరన్, జింక్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను ధృడ పరచడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.